Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్‌స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ట్రావిస్ హెడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్.. అభిషేక్ శర్మ సరసన నిలిచాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్‌కు ఇది మూడో ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 6 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్ గేల్(3), సునీల్ నరైన్(3), ట్రావిస్ హెడ్ తర్వాతి స్థానంలో ఉన్నారు.

DC vs SRH Travis Head unstoppable he slams 16 ball 50 in IPL 2024

36 బంతుల్లో 24 బౌండరీలు..
ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 46) విధ్వంసకర బ్యాటింగ్‌తో‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక పవర్ ప్లే స్కోర్. టీ20 క్రికెట్ చరిత్రలో కూడా పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

పవర్ ప్లేలోని 36 బంతుల్లో 6 బాల్సే డాట్ అవ్వగా.. సన్‌రైజర్స్ బ్యాటర్లు 11 సిక్స్‌లు, 13 ఫోర్లు కొట్టారు. 2017లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్‌గా ఉండగా.. సన్‌రైజర్స్ 125/0 స్కోర్‌తో అధిగమించింది.

తొలి ఓవర్ నుంచే..
ఖలీల్ అహ్మద్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ 6, 4, 4 బాదగా.. అభిషేక్ శర్మ ఓ బౌండరీ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. స్పిన్నర్ లలిత్ యాదవ్‌ను రిషభ్ పంత్ బరిలోకి దించగా.. ట్రావిస్ హెడ్ 6, 6, 4 బాదగా అభిషేక్ శర్మ ఓ బౌండరీ కొట్టడంతో 21 పరుగులు వచ్చాయి. అన్రిచ్ నోర్జ్ వేసిన మూడో ఓవర్‌లో ట్రావిస్ హెడ్, 4, 4, 0, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు.

దాంతో సన్‌రైజర్స్ 3 ఓవర్లలోనే 62 పరుగులు చేసుకోగా.. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లలిత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్‌లో అభిషేక్ శర్మ ఓ సిక్సర్ కొట్టగా.. ట్రావిస్ హెడ్ మరో రెండు సిక్స్‌లు బాదాడంతో 21 పరుగులు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో ఓవర్‌నూ అభిషేక్ శర్మ 3 సిక్స్‌లతో 20 పరుగులు పిండుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 ఓవర్లలోనే 103 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్రకెక్కింది.

ముఖేష్ కుమార్ వేసిన ఆరో ఓవర్‌లోనూ ట్రావిస్ హెడ్ వరుసగా 4, 4, 4 4, 0, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు.

Story first published: Saturday, April 20, 2024, 20:02 [IST]
Other articles published on Apr 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+