Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: నిప్పులు చెరిగిన నటరాజన్.. ఢిల్లీపై సన్‌రైజర్స్ ఘన విజయం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జోరును కొనసాగిస్తుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో వరుసగా నాలుగో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో సమష్టిగా చెలరేగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, షెహ్‌బాజ్ అహ్మద్ సత్తా చాటగా.. బౌలింగ్‌లో నటరాజన్ నిప్పులు చెరిగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 46), షెహ్‌బాజ్ అహ్మద్(29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

Natarajan shine

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్(18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65),అభిషేక్ పోరెల్(22 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), రిషభ్ పంత్(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) రాణించినా ఫలితం లేకపోయింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(4/19) నాలుగు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. మయాంక్ మార్కండే(2/26), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు తీసారు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్‌లకు తలో వికెట్ దక్కింది.

Story first published: Saturday, April 20, 2024, 23:26 [IST]
Other articles published on Apr 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+