DC vs SRH: రఫ్ఫాడించిన రషీద్ ఖాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ!

అబుదాబి: రషీద్ ఖాన్(3/14) రఫ్ఫాడించడంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగిన ఆరెంజ్ ఆర్మీ 15 పరుగులతో గెలుపొందింది. జట్టులో మార్పులు చేసి బ్యాలెన్సెడ్‌గా బరిలోకి దిగిన డేవిడ్ సేన ఫలితాన్ని రాబట్టి తమ వరుస పరాజయాలకు ముగింపు పలికింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), కేన్ విలియమ్సన్(26 బంతుల్లో 5 ఫోర్లు 41) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా(2/21), అమిత్ మిశ్రా(2/35) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్(34), రిషభ్ పంత్(28), హెట్‌మైర్(21) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ మూడు వికెట్లు తీయగా.. భువీ 2, ఖలీల్, నటరాజన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

భువీ శుభారంభం..
ఇక 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీషా(2)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్‌కు శుభారంభాన్ని అందించాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 38 పరగులు మాత్రమే చేసింది.

చెలరేగిన రషీద్ ఖాన్..
ఆ వెంటనే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(17) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో ఢిల్లీ స్కోర్ బోర్డు వేగం తగ్గింది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన శిఖర్ ధావన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. సన్‌రైజర్స్ రివ్యూకెళ్లి ఫలితం సాధించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్‌తో పంత్ ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నాడు.
అయితే 13వ ఓవర్‌లో పంత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అభిషేక్ వర్మ చేజార్చడు. ఆ అవకాశంతో చెలరేగిన పంత్.. చివరి రెండు బంతులను భారీ సిక్స్‌లు కొట్టాడు. ఇక ఖలీల్ అహ్మద్ వేసిన 15వ ఓవర్‌లో బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్టి హెట్‌మైర్ టచ్‌లోకి వచ్చాడు. దీంతో భువీని రంగంలోకి దింపిన వార్నర్.. ఫలితాన్ని రాబట్టాడు. అతను వేసిన 16వ ఓవర్ తొలి బంతిని హెట్‌మైర్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. లాంగాఫ్‌లో మనీష్ పాండే అద్భుతంగా అందుకున్నాడు.

సూపర్ బౌలింగ్..
క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ వచ్చి రావడంతో బౌండరీ కొట్టగా.. ఆఖరి బంతికి పంత్ మరో బౌండరీ సాధించడంతో ఈ ఓవర్‌లో 16 రన్స్ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రషీద్ ఖాన్‌ను దింపిన డేవిడ్ వార్నర్ ఫలితాన్ని రాబట్టాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే స్టోయినిస్ ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 28 పరుగులు అవసర కాగా.. ఖలీల్ అహ్మద్ అద్భుత బౌలింగ్‌లో అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications