Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: అందుకే ఉనాద్కత్‌ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బాగుంది. మా జట్టు ప్రధాన బలమే బ్యాటింగ్. అందుకే ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. మా జట్టులో బ్యాటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ కూడా రావచ్చు. సన్‌రైజర్స్ హైదారబాద్ అసాధారణ క్రికెట్ ఆడుతోంది. వారిని లైట్ తీసుకునేందుకు లేదు.

DC vs SRH Pat Cummins reveals the reason why Jaydev Unadkat is not playing vs Delhi in IPL 2024

మైదానంతో వచ్చేది ఏం లేదు. ఎవరు మంచి క్రికెట్ ఆడితే వారినే విజయం వరిస్తుంది. మేం జట్టుగా.. వ్యక్తిగతంగా ప్రతీ విషయంలో మెరుగవ్వాలనుకుంటున్నాం. లలిత్ యాదవ్, అన్రిచో నోర్జ్ జట్టులోకి వచ్చారు. వెన్ను నొప్పితో ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.'అని రిషభ్ పంత్ తెలిపాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. వికెట్ బాగుంది. మా ఆటగాళ్ల బ్యాటింగ్ చేసే విధానంతో ప్రత్యర్థి జట్లు కఠినమైన ప్రణాళికలతో వస్తాయి. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు. పిచ్ కండిషన్స్ బట్టి బౌలింగ్ యూనిట్‌పై తుది నిర్ణయం తీసుకుంటాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఉనాద్కత్‌ను తుది జట్టులో నుంచి తప్పించామని కమిన్స్ తెలిపాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రెసర్-మెక్‌గర్క్/షై హోప్, అభిషేక్ పోరెల్, రిషభ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్

Story first published: Saturday, April 20, 2024, 19:34 [IST]
Other articles published on Apr 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+