ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిసింది. శనివారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ హైస్కోరింగ్ గేమ్‌లోఇరు జట్ల ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. మొత్తం ఈ మ్యాచ్‌లో 71 బౌండరీలు నమోదయ్యాయి.
ఇందులో 40 ఫోర్లు, 31 సిక్సర్లు ఉండటం విశేషం. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఇన్ని బౌండరీలు నమోదవ్వడం ఇది రెండోసారి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 81 బౌండరీలు నమోదయ్యాయి. ఈ బౌండరీలే హయ్యెస్ట్‌గా కొనసాగుతున్నాయి.

బ్యాటర్ల విధ్వంసంతో బౌండరీల బయట ఉండి బాల్స్ అందించే బాల్ బాయ్స్ బెంబేలెత్తిపోయారు. రక్షణ కోసం హెల్మెట్స్ ధరించారు. మైదానంలోని ప్రతీ బాల్ బాయ్స్ హెల్మెంట్ ధరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదేం కర్మరా అయ్యా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల గేమ్‌గా మారిపోయిందని అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 46), షెహ్‌బాజ్ అహ్మద్(29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్(18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65),అభిషేక్ పోరెల్(22 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), రిషభ్ పంత్(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) రాణించినా ఫలితం లేకపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(4/19) నాలుగు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. మయాంక్ మార్కండే(2/26), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు తీసారు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్‌లకు తలో వికెట్ దక్కింది.