Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: ఒకే ఓవర్లో 4, 4,6, 4, 6, 6

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 6 బంతుల్లో 6 బౌండరీలు బాది 30 పరుగులు పిండుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్ ఈ ఫీట్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్‌లో జేక్ ఫ్రెజర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఈ ఓవర్‌లో 4, 4, 6, 4, 6, 6 తో ప్రతీ బంతిని బౌండరీకి తరలించాడు. అనంతరం కమిన్స్ బౌలింగ్‌లోనూ ధాటిగా ఆడిన జేక్ ఫ్రెజర్.. మయాంక్ మార్కండే వేసిన ఏడో ఓవర్‌లో సిక్స్‌ బాది 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

DC vs SRH Jake Fraser McGurk smashed 4 4 6 4 6 6 in an over against Washington Sundar

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన జేక్ ఫ్రెజర్.. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మయాంక్ మార్కండే బౌలింగ్‌లోనే క్యాచ్‌గా ఔట్‌గా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 46), షెహ్‌బాజ్ అహ్మద్(29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 20, 2024, 22:47 [IST]
Other articles published on Apr 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+