For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs SRH: కొంపముంచిన టాపార్డర్.. ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్‌ ఓటమి!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆరెంజ్ ఆర్మీ ఓటమిపాలైంది. వైజాగ్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైంది. మరోసారి టాపార్డర్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(5/35) ఐదు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్(3/22) మూడు వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మ(1) ఓ వికెట్ దక్కింది.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే 3 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫాఫ్ డుప్లెసిస్(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), అభిషేక్ పోరెల్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేఎల్ రాహుల్(15) విఫలమైనా.. ట్రిస్టన్ స్టబ్స్(14 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జీషన్ అన్సారీ(3/42) ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

DC vs SRH IPL 2025 What was the Turning Point as Delhi thump Sunrisers in Vizag

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలమైన టాపార్డర్ వైఫల్యం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అలసత్వంతో అనవసర పరుగుకు ప్రయత్నించి అభిషేక్ శర్మ(1) రనౌటవ్వడం.. ఒకే ఓవర్‌లో ఇషాన్ కిషన్(2), నితీష్ కుమార్ రెడ్డి(0) వెనుదిరగడం.. నిలకడగా ఆడిన ట్రావిస్ హెడ్ కూడా వెనుదిరగడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేసినా.. ఢిల్లీ బౌలర్లు కుదురుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించారు.

మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్..
ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్.. ఐదు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. పవర్ ప్లేలోనే డేంజరస్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డితో పాటు ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన స్టార్క్..చివర్లో హర్షల్ పటేల్, ఇంపాక్ట్ ప్లేయర్ అయిన వియాన్ మల్డర్(9)ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు.

అన్‌సంగ్ హీరో..
ఈ మ్యాచ్‌‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన జీషన్ అన్సారీ అన్‌సంగ్ హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సానుకూలాంశం ఏదైనా ఉందా? అంటే అది జీషన్ అన్సారీ మాత్రమే. అతను టీమ్ మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు చెలరేగి ఉంటే మ్యాచ్ మరింత హోరాహోరీగా సాగేది.

Story first published: Sunday, March 30, 2025, 19:02 [IST]
Other articles published on Mar 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+