Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: రూ.13 కోట్లు పెట్టి శనిని కొనుక్కున్నామ్ కదరా.. ఎర్రీ బ్రూక్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ హ్యారీ బ్రూక్(0) దారుణంగా విఫలమయ్యాడు. సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.

పేలవ ప్రదర్శనతో బ్యాటింగ్ ఆర్డర్‌‌లో డీమోట్ అయ్యి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. దాంతో ఈ ఇంగ్లండ్ క్రికెటర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో
రూ.13.25 కోట్ల భారీ ధరకు హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.

Harry Brook

కానీ అతను కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో చేసిన సెంచరీ మినహా మరే మ్యాచ్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్‌లో హ్యారీ బ్రూక్ వరుసగా 13(21), 3(4), 13(14), 100*(55), 9(7), 18(13), 7(14), 0(2) విఫలమయ్యాడు. దాంతో రూ.13 కోట్లు పెట్టి శనిని కొన్నుక్కున్నట్లే ఉందని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎర్రీ బ్రూక్ అంటూ ఫన్నీ మీమ్స్‌తో అతన్ని ఓ ఆట ఆడుకుంటున్నారు.

వెంటనే హ్యారీ బ్రూక్‌ను జట్టు నుంచి తప్పించి గ్లేన్ ఫిలిప్స్‌ను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. కావ్య పాప ఈ ఎర్రీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్ల దండుగ చేసిందని విమర్శిస్తున్నారు. తాజా వైఫల్యంతో హ్యారీ బ్రూక్ బెంచ్‌కే పరిమితమవుతాడని, వాటర్ బాటిల్స్ మోయాల్సిందేనని మండిపడుతున్నారు.

ఫ్లాట్‌గా ఉంటే పాకిస్థాన్ బ్యాటింగ్ పిచ్‌లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఎర్రీ బ్రూక్.. అసలు సిసలు సవాల్ విసిరే భారత పిచ్‌ల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడని ఎగతాళి చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(36 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 67), హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 29, 2023, 22:38 [IST]
Other articles published on Apr 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+