Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: రెండు కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్

Excellent review to dismiss Warner on 45

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వరుస ఓవర్లలో వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. దాంతో కెప్టెన్ కమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అమిత్ మిశ్రా వేసిన 10వ ఓవర్‌ మూడో బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయిన వార్నర్ కీపర్ క్యాచ్‌‌గా వెనుదిరిగాడు.

తొలుత ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఢిల్లీ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(3) భారీషాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో హైదరాబాద్ 92 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో మరో ఓపెనర్ బెయిర్ స్టో(40)‌తో పాటు, కేన్ విలియమ్సన్(1) ఉన్నారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కట్టడి చేశారు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసింది. అనంతరం ధాటిగా ఆడిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో రన్‌రేట్‌ను పెంచే ప్రయత్నం చేశారు.

Story first published: Tuesday, September 29, 2020, 20:48 [IST]
Other articles published on Sep 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+