
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఓ మార్పుతో బరిలోకి దిగుతున్నామని, అవేశ్ ఖాన్ స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చాడన్నాడు. ఇక హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మహ్మద్ నబీ స్థానంలో కేన్ విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చాడు. దాదాపు 2 మ్యాచ్‌ల తర్వాత అతనికి అవకాశం దక్కింది. సాహా స్థానంలో అబ్దుల్ సమాద్ వచ్చాడు. ఐపీఎల్‌లో అతనికిది అరంగేట్ర మ్యాచ్. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడు. ఇక డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్‌గా ఇది 50వ మ్యాచ్.
ఓవైపు రెండు వరుస విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్సాహంగా ఉండగా.. మరోవైపు రెండు వరుస పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒత్తిడి నెలకొంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఢిల్లీ దూసుకుపోతుంటే.. పేలవ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ డీలాపడిపోయింది. ఢిల్లీ గెలిచినా, సన్‌రైజర్స్ ఓడినా.. హ్యాట్రిక్ అయితే నమోదు కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి 2016 సీజన్ సెంటిమెంట్ రిపీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో వార్నర్ సేన బరిలోకి దిగుతుంది.
ఐపీఎల్ టోర్నీలో ఇప్పుటి వరకు ఈ రెండు జట్లు 15 సార్లు తలపడగా 8-6తో హైదరాబాద్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యం చెలాయించాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తుండగా.. జైత్రయాత్ర కొనసాగించాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. గతంలో ఈ మైదానంలో హైదరాబాద్ మూడు మ్యాచ్‌లాడి మూడింట్లోనూ ఓడిపోయింది. ఢిల్లీ కూడా ఆడిన ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
తుది జట్లు
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్‌శ ర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, టీ నటరాజన్, అబ్దుల్ సమద్
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, షిమ్రాన్ హెట్‌మైయిర్, మార్కస్ స్టొయినిస్, అక్షర్ పటేల్, కాగిసో రబాడా, అన్రిచ్ నోర్జె, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ.