DC vs SRH: కావ్య పాపపై కసితీర్చుకున్న డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం!

ముంబై: ఘోరంగా అవమానించిన తన పాత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 నాటౌట్) కసి తీర్చుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వార్నర్‌కు అండగా రోవ్‌మన్ పొవెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఈ ఇద్దరి విధ్వంసం ముందు హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. పోటాపడి మరీ పరుగులిచ్చుకున్నారు. భువీ, సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.

శుభారంభం లేకున్నా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. పృథ్వీ షా స్థానంలో జట్టులోకి వచ్చిన మన్‌దీప్ సింగ్(0) బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లోనే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే మిచెల్ మార్ష్(10)ను సీన్ అబాట్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

వార్నర్ విధ్వంసం..
శ్రేయస్ గోపాల్ వేసిన 9వ ఓవర్‌లో పంత్ 6,6,6,4తో విశ్వరూపం చూపించాడు. అదేజోరులో మరుసటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 12వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన వార్నర్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వార్నర్‌కు ఇది 54వ హాఫ్ సెంచరీ. రోవ్‌మన్ పొవెల్ సైతం ధాటిగా ఆడాడు. అయితే అతను ఇచ్చిన మూడు క్యాచ్‌లను సన్‌రైజర్స్ నేలపాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

చెలరేగిన పోవెల్
18పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ మామ వదిలేయగా.. 41 పరుగుల వద్ద కష్టతరమైన క్యాచ్‌ను మార్కరమ్ అందుకోలేకపోయాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ సైతం భారీ షాట్లతో చెలరేగడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతిని సిక్సర్ బాదిన రోవ్‌మన్ పొవెల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం హ్యాట్రిక్ బౌండరీలు బాదిన పొవెల్ జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications