Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: ఈ మూడు తప్పిదాలే ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచాయి!

 DC vs SRH: 3 Mistakes committed by Delhi Capitals against Sunrisers Hyderabad
IPL 2020,DC vs SRH : 3 Major Mistakes Done By Delhi Capitals Against Sunrisers Hyderabad

అబుదాబి: ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 సీజన్‌లో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులతో గెలుపొందింది. వరుసగా రెండు ఓటముల తర్వాత గొప్పగా పుంజుకుంది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), కేన్ విలియమ్సన్(26 బంతుల్లో 5 ఫోర్లు 41) రాణించినా..స్లో ట్రాక్‌పై మోస్తరు స్కోరుకే పరిమితమైన రైజర్స్.. తన మార్క్ బౌలింగ్‌తో దాన్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. చివర్లో రిషభ్ పంత్, హెట్‌మయర్ భారీ షాట్లు ఆడినా.. హైదరాబాద్ బౌలర్ల ముందు వారి ఆట ఎంతోసేపు నిలవలేదు.

మరోవైపు వరస విజయాలతో దూకుడుగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. క్యాచ్ డ్రాప్స్‌, కెప్టెన్సీలోపాలతో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా ఆ జట్టు చేసిన మూడు తప్పిదాలు ఓటమికి కారణమయ్యాయి.

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం..

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం..

స్లో వికెట్ ట్రాక్‌పై టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ అనాలోచితంగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. డ్యూ ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. దాదాపు ఈ లీగ్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన ప్రతీ కెప్టెన్ చెప్పే మాట ఇది. కానీ రెండు, మూడు మ్యాచ్‌లు మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందింది. అది పక్కనబెడితే ఈ అబుదాబి ట్రాక్‌పై పరుగులు చేయడానికి బ్యాట్స్‌మన్ తెగ ఇబ్బంది పడ్డారు. బౌండరీలు దూరంగా ఉండటం.. స్లో ట్రాక్ కావడంతో హైదరాబాద్ ఆటగాళ్లు తెలిలిగా క్విక్ సింగిల్స్, డబుల్స్ తీశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ మరింత కఠినమైంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. భారీ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

అక్సర్ పటేల్‌‌తో బౌలింగ్ చేయించకపోవడం..

అక్సర్ పటేల్‌‌తో బౌలింగ్ చేయించకపోవడం..

ఇక మిడిల్ ఓవర్లలో అక్సర్ పటేల్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడం కూడా ఢిల్లీ ఓటమికి కారణమైంది. రెండు ఓవర్లు వేసిన అతను 14 పరుగులే ఇచ్చాడు. కానీ అయ్యర్.. పటేల్‌ను కాదని స్టోయినిస్‌తో వేయించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో అయ్యర్ తీసుకున్న ఈ నిర్ణయం ఢిల్లీ ఫలితంపై ప్రభావం చూపింది. అక్సర్ కనుక బౌలింగ్ చేసి బెయిర్ స్టో లేక విలియమ్సన్ వికెట్ తీసి ఉంటే సన్‌రైజర్స్ 150 పరుగుల లోపే కట్టడయ్యేది. అప్పుడు టార్గెట్ చేజ్ చేయడానికి ఢిల్లీకి సులువయ్యేది.

ఆదిలోనే వికెట్లు కోల్పోవడం..

ఆదిలోనే వికెట్లు కోల్పోవడం..

163 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించడం భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద కష్టమేమి కాదు. కానీ ఆదిలోనే పృథ్వీషా, శ్రేయ్యస్ అయ్యర్ వికెట్లు కోల్పోవడం ఆ జట్టును దెబ్బతీసింది. దీంతో ఒత్తిడికి లోనైనా ఇతర బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఇక పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సన్‌రైజర్స్ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. అయితే ఆఖర్లో రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్ ఉండి ఉంటే మాత్రం ఫలితం మరోలా ఉండేది. చేజింగ్ రన్‌రేట్ పెరగడంతో ఒత్తిడికి లోనైన ఈ ఇద్దరు వికెట్ సమర్పించుకున్నారు.

రఫ్ఫాడించిన రషీద్ ఖాన్..

రఫ్ఫాడించిన రషీద్ ఖాన్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), కేన్ విలియమ్సన్(26 బంతుల్లో 5 ఫోర్లు 41) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా(2/21), అమిత్ మిశ్రా(2/35) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్(34), రిషభ్ పంత్(28), హెట్‌మైర్(21) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ మూడు వికెట్లు తీయగా.. భువీ 2, ఖలీల్, నటరాజన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

DC vs SRH: తల్లిదండ్రులను కోల్పోయి ఏడాదిన్నరగా నరకం అనుభవించా.. రషీద్ ఖాన్ భావోద్వేగం!

Story first published: Wednesday, September 30, 2020, 10:34 [IST]
Other articles published on Sep 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+