Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చాహల్!

రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ ఈ ఫీట్ సాధించాడు.

రిషభ్ పంత్‌ను క్యాచ్ ఔట్‌గా చేర్చి టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 301 మ్యాచ్‌ల్లో చాహల్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న 11వ బౌలర్‌గా నిలిచాడు. చాహల్ కన్నా ముందు డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహీర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగా, సోహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ ఈ ఫీట్ సాధించారు.

DC vs RR Yuzvendra Chahal became the first Indian bowler to pick up 350 wickets in T20s

భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ తర్వాత పియూష్ చావ్లా(293 మ్యాచ్‌ల్లో 310), రవిచంద్రన్ అశ్విన్(318 మ్యాచ్‌ల్లో 306), భువనేశ్వర్ కుమార్(281 మ్యాచ్‌ల్లో 297 వికెట్లు) అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) మెరుపులు మెరిపించాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రసిక్ సలామ్‌ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Tuesday, May 7, 2024, 22:16 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+