Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: శాంసన్ చెలరేగినా.. రాజస్థాన్‌కు తప్పని పరాజయం! ప్లే ఆఫ్ చేరిన పంత్ సేన!

DC vs RR: Sanju Samson 70 not out in vain as Delhi crush Rajasthan by 33 runs

అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. డబుల్ హెడర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. బ్యాటింగ్‌లో తడబడినా.. బౌలింగ్‌లో సత్తాచాటి అద్భుత విజయాన్నందుకుంది. ఫలితంగా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ప్లే ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 43), రిషభ్ పంత్(24), షిమ్రన్ హెట్‌మైర్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/22), చేతన్ సకారియా (2/33) రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగీ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ ఓ వికెట్ తీయగా.. మిగతా బౌలర్లందరూ (ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అక్షర్ పటేల్) తలో వికెట్ తీశారు.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్ లివింగ్ స్టోన్(1), యశస్వీ జైస్వాల్(5) తీవ్రంగా నిరాశపరిచారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్, అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో జైస్వాల్(5) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. దాంతో రాజస్థాన్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు మహిపాల్ లోమ్‌రర్(19 ) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసారు.

కానీ వరుస విరామాల్లో వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్లు వారికి అవకాశం ఇవ్వలేదు. స్లోయర్, నకుల్ బాల్స్‌తో భారీ షాట్లు ఆడకుండా ఇబ్బంది పెట్టారు. దాంతో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు శాంసన్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలోనే 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్‌కు మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. లోమ్‌రర్(19),రియాన్ పరాగ్(2), రాహుల్ తెవాటియా(9) దారుణంగా విఫలమయ్యారు.

Story first published: Saturday, September 25, 2021, 19:52 [IST]
Other articles published on Sep 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+