Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 31 పరుగులు! (వీడియో)

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్(43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించాడు.

ఈ ఓవర్‌లో వరుసగా 2, వైడ్, 6, 4, 6, 6, 6‌ బాది 31 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి క్విక్ డబుల్ తీసిన పంత్.. లో-ఫుల్‌టాస్‌గా వచ్చిన రెండో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్ బాదాడు. వైడ్ యార్కర్‌గా వేసిన మూడో బంతిని డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ కొట్టాడు.

DC vs RR Rishabh Pant Smash 31 runs in Single Over against Mohit Sharma in IPL 2024

నాలుగో బంతిని డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా.. ఐదో బంతిని లాంగాన్‌లో.. చివరి బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా సిక్సర్లు బాదాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

పంత్‌కు తోడుగా అక్షర్ పటేల్(43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ట్రిస్టన్ స్టబ్స్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత 16 నెలల పాటు ఆటకు దూరమైన రిషభ్ పంత్.. ఈ టోర్నీతోనే మళ్లీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. అసాధారణ బ్యాటింగ్.. సంచలన వికెట్ కీపింగ్‌తో పాత పంత్‌ను తలపిస్తున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌‌ బ్యాటర్‌గా..వికెట్ కీపర్‌గా హయ్యెస్ట్ రన్స్ చేసాడు. 161.3 స్ట్రైక్‌రేట్‌తో 342 పరుగులు చేశాడు. సంచలన బ్యాటింగ్‌తో భారత సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయాల్సిందేనని తన బ్యాట్‌తోనే హెచ్చరిస్తున్నాడు.

Story first published: Wednesday, April 24, 2024, 21:55 [IST]
Other articles published on Apr 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+