Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రిషభ్ పంత్(43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసింది.

అక్షర్ పటేల్(43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ట్రిస్టన్ స్టబ్స్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు. రిషభ్ పంత్ విధ్వంసానికి మోహిత్ శర్మ ఆఖరి ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్ గుజరాత్ టైటాన్స్ కొంపముంచింది.

DC vs RR Rishabh Pant and Axar Patel power Delhi Capitals to 224 4

మెరుపు ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్(23), పృథ్వీ షా(11) మెరుపు ఆరంభాన్ని అందించారు. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయారు. సందీప్ వారియర్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇద్దరూ నూర్ అహ్మద్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా అక్షర్ పటేల్‌‌ను బ్యాటింగ్‌కు పంపింది.

అయితే క్రీజులోకి వచ్చిన షై హోప్(5) దారుణంగా విఫలమయ్యాడు. సందీప్ వారియర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో 3 వికెట్లకు 44 పరుగులే చేసింది. ఈ పరిస్థితుల్లో రిషభ్ పంత్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు.

DC vs RR Rishabh Pant and Axar Patel power Delhi Capitals to 224 4

చెలరేగిన అక్షర్, పంత్
క్రీజులో సెట్ అయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే రిషభ్ పంత్ 34 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నూర్ అహ్మద్ విడదీసాడు. అక్షర్ పటేల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

DC vs RR Rishabh Pant and Axar Patel power Delhi Capitals to 224 4

పంత్ విధ్వంసం..
క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, రిషభ్ పంత్ ధాటిగా ఆడారు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. సాయి కిషోర్ వేసిన 19వ ఓవర్‌లో స్టబ్స్ వరుసగా 4, 6, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో రిషభ్ పంత్ వరుసగా 2, 6, 4, 6, 6, 6‌ బాది 31 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 224 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Story first published: Wednesday, April 24, 2024, 21:21 [IST]
Other articles published on Apr 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+