Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: DC vs RR మ్యాచ్‌లో రాజకీయ నినాదాలు.. ఉద్రిక్తత! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కొందరు అభిమానులు రాజకీయ నినాదాలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా మ్యాచ్‌కు హాజరైన కొందరు ప్రేక్షకులు స్లోగన్స్ చేయడంతో పాటు ప్లకార్డ్స్ ప్రదర్శించారు.

బీజేపీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ మద్దతుదారులు కూడా వారికి స్లోగన్స్‌కు ధీటుగా బదులిచ్చారు. ఈ ఊహించని ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేసిన అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.

DC vs RR Delhi Police detain fans in DC vs RR match for raising political slogan

కేజ్రీవాల్‌కు మద్దతుగానే టీషర్ట్స్ ధరించి ఈ మ్యాచ్‌కు హాజరైన అభిమానులు.. ప్లకార్డ్స్ కూడా ప్రదర్శించారు. పోలీసుల కళ్లు గప్పి అభిమానులు ఆ వస్తువులను మైదానంలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దేశరాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కేజ్రీవాల్‌లో జైల్లోనే ఉన్నారు. ఆయనతో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కూతురు కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఈడీ అదుపులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Tuesday, May 7, 2024, 22:59 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+