Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs PBKS: అజింక్యా రహానేపై వేటు.. స్మిత్‌కు చాన్స్.. పంజాబ్‌దే బ్యాటింగ్!

DC vs PBKS: Steve Smith debuts for Delhi, Punjab bat first

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. ఢిల్లీ మాత్రం రెండు కీలక మార్పులు చేసింది. ఆ జట్టు సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానేపై వేటు వేసి స్టీవ్ స్మిత్‌కు అవకాశం ఇచ్చింది. స్మిత్‌కు ఢిల్లీ తరఫున ఇదే ఫస్ట్ మ్యాచ్. ఇక గత మ్యాచ్‌లో దారళంగా పరుగులిచ్చిన టామ్ కరన్‌‌కు ఆ జట్టు ఉద్వాసన పలికింది. అతని స్థానంలో యువ ప్లేయర్ లుక్మాన్ మెరీవాలా జట్టులోకి వచ్చాడు. ఇక పంజాబ్ జట్టులో మురుగన్ అశ్విన్ స్థానంలో జలజ్ సక్సెనాకు అవకాశం దక్కింది.

తమ ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయాన్నందుకున్న ఢిల్లీ.. సెకండ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు రాజస్థాన్‌పై తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్ కింగ్స్.. రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోవడంతో.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ కూడా అసలు సిసలు మజానివ్వనుంది. ఐపీఎల్‌ల్లో పంజాబ్, ఢిల్లీ ఇప్పటి వరకూ 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించగా.. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది.

తుది జట్లు:
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, లుక్మాన్ మెరివాలా, క్రిస్ వోక్స్, ఆర్ అశ్విన్, కగిసో రబడా, అవెష్ ఖాన్.

పంజాబ్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, జే రిచర్డ్సన్, జలజ్ సక్సెనా, మహ్మద్ షమీ, రిలే మెరాడిత్, అర్షదీప్ సింగ్.

Story first published: Sunday, April 18, 2021, 19:47 [IST]
Other articles published on Apr 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+