Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: పాపం సూరీడు.! తీవ్ర గాయంతో ఆటకు దూరం! (వీడియో)

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఏది కలిసి రావడం లేదు. గత నెల రోజులుగా అతను విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా‌తో టెస్ట్ సిరీస్ అరంగేట్రం తర్వాత సూర్య చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ వరుసగా మూడు మ్యాచ్‌లో డకౌటై తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో‌నూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అతను ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద సునాయస క్యాచ్‌ను నేలపాలు చేసిన సూర్య.. గాయంతో మైదానం వీడాడు.

surya kumar yadav injured

బంతిని అందుకునే క్రమంలో అలసత్వం ప్రదర్శించగా.. అది కాస్త అతను నుదిటికి బలంగా తాకింది. ఫిజియోల సూచనలతో మైదానం వీడిన సూర్య డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అతను బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అతని గాయం పెద్దదైతే ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లే. సూర్య లాంటి ఆటగాడిని ఏ ప్లేయర్‌తోనూ ముంబై ఇండియన్స్ భర్తీ చేయలేదు.

సూర్య గాయపడటంపై అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా సూర్యకు ఏం కలిసి రావడం లేదని, అతను త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని అండగా నిలుస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 51), అక్షర్ పటేల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా(3/22), జాసన్ బెహెండార్ఫ్(3/23) మూడేసి వికెట్లతో చెలరేగగా.. రిలే మెరిడిత్ రెండు వికెట్లు, హృతిక్ షోకీన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 31) శుభారంభం అందించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకుంది. రోహిత్ అత్యుత్సాహంతో సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. ఇషాన్ కిషన్ బలయ్యాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో రోహిత్ పోరాడుతున్నాడు.

Story first published: Tuesday, April 11, 2023, 22:46 [IST]
Other articles published on Apr 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+