న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కొంచెం డ్రైగా ఉండటంతో పాటు రాత్రి వేళలో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
అంతేకాకుండా తొలి రెండు మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయామని, దాంతో చేజింగ్‌కు మొగ్గు చూపుతున్నామని స్పష్టం చేశాడు. స్టబ్స్ స్థానంలో రిలే మెరిడిత్‌ను జట్టులోకి తీసుకున్నామని చెప్పిన రోహిత్.. ఈ మ్యాచ్‌లో కూడా జోఫ్రా ఆర్చర్ ఆడటం లేదన్నాడు. అతను ఇంకా ఫిట్ అవ్వలేదని చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

తాము కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమ్‌గా రిథమ్ అందుకోవడంపై ఫోకస్ పెట్టామని చెప్పిన వార్నర్.. సమష్టిగా రాణించేందుకు చాలా హార్డ్ వర్క్ చేశామన్నాడు. తప్పని పరిస్థితుల్లో జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు.
గాయంతో ఖలీల్ అహ్మద్ దూరమయ్యాడని, అతని స్థానంలో యశ్ ధుల్ ఆడుతున్నాడని చెప్పాడు. రిలీ రోసౌ స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు. జట్టులోని ఆటగాళ్లంతా విజయం కోసం కసిగా ఉన్నారని, పరిస్థితులకు తగ్గట్లు ఆడటమే ముఖ్యమని చెప్పాడు. హోమ్ గ్రౌండ్‌లో ఆడటం తమకు కలిసొచ్చే అంశమని వార్నర్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీశ్ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పొవెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్(కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వదేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పియూష్ చావ్లా, జాసన్ బెహండార్ఫ్, రిలే మెరిడిత్