చిట్టి రోబో తెలుసుగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సినిమాలో అనేక పనులను చకచకా చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అచ్చం అలాంటి రోబో డాగ్‌నే ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ టీమ్ అభిమానులకు పరిచయం చేసింది. మ్యాచ్ కవరేజ్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ చిట్టి రోబో డాగ్‌ను ప్రవేశ పెట్టింది. ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ముందు ఈ చిట్టి రోబోను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డానీ మోరీసన్ ఐపీఎల్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
బ్రాడ్‌కాస్ట్ కెమెరాలకు అనుసంధానంగా ఉన్న ఈ రోబోటిక్ డాగ్.. డానీ మోరీసన్ మాటలకు స్పందించడం విశేషం. తనదైన కామెడీతో మోరీసన్ ఈ రోబోటిక్ డాగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ రోబోటిక్ డాగ్‌కు పేరు పెట్టాలని కూడా అభిమానులను మోరీసన్ కోరాడు. ఈ వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ రోబోటిక్ డాగ్‌తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రీస్ టోప్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్‌లు సరదాగా గడిపారు. రోబోటిక్ డాగ్ పని తీరును పరీక్షించారు. రోబోటిక్ డాగ్‌తో మోరీసన్ సరదాగా పరుగు పందెం పెట్టుకున్నాడు. ఈ పోటీలో రోబోటిక్ డాగ్ గెలవడం విశేషం. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు టాస్ కాయిన్ కూడా ఈ రోబోటిక్ డాగ్ తీసుకురావడం గమనార్హం.