For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs MI: తెలుగోడి విధ్వంసం..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.

తిలక్ వర్మతో పాటు ర్యాన్ రికెల్టన్(25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), నమన్ ధీర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/23), విప్రజ్ నిగమ్(2/41) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది.

DC vs MI IPL 2025 Tilak Varma 59 and Naman Dhir 38 Helps Mumbai Post 205 5 vs Delhi

రోహిత్ విఫలం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 18) మరోసారి నిరాశపరిచాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. సూర్యతో కలిసి ర్యాన్ రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం రంగంలోకి దిగిన కుల్దీప్ యాదవ్.. స్టన్నింగ్ డెలివరీతో ర్యాన్ రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రికెల్టన్ హాఫ్ సెంచరీ చేసుకోకుండానే వెనుదిరిగాడు.

సూర్య మెరుపులు..
తిలక్ వర్మతో జత కలిసిన సూర్య తనదైన శైలిలో చెలరగాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదాడు. క్రీజులో సెట్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ను కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(2) తీవ్రంగా నిరాశపరిచాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.

తిలక్ వర్మ హాఫ్ సెంచరీ..
నమన్ ధీర్‌తో కలిసి తిలక్ వర్మ తన జోరును కొనసాగించాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఫోర్, సింగిల్ బాది తిలక్ వర్మ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నమన్ ధీర్ కూడా బౌండరీలతో చెలరేగాడు. మిచెల్ స్టార్క్ వేసిన 18వ ఓవర్‌లో నమన్ ధీర్ బాదిన సిక్సర్‌ను అక్షర్ పటేల్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో సింగిల్‌గా మార్చాడు. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి మరి అడ్డుకున్నాడు.

19వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన నమన్ ధీర్.. ఆఖరి ఓవర్‌లో ఓ బౌండరీ కొట్టాడు. కానీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ లైన్‌పై పోరెల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నమన్ ధీర్ ఆఖరి బంతికి నాలుగు సింగిల్స్ తీసి 205 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Story first published: Sunday, April 13, 2025, 21:27 [IST]
Other articles published on Apr 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+