Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: హ్యాట్రిక్ రనౌట్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంపాక్ట్ ప్లేయర్ కర్ణ్ శర్మ(3/36) మూడు వికెట్లతో పాటు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఆ జట్టు విజయానికి కారణమైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ర్యాన్ రికెల్టన్(25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), నమన్ ధీర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/23), విప్రజ్ నిగమ్(2/41) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది.

DC vs MI IPL 2025 Mumbai s run-out hat-trick denies Delhi Capitals win in thriller

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. అభిషేక్ పోరెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) పర్వాలేదనిపించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కర్ణ్ శర్మ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.

3 బంతుల్లో మూడు రనౌట్స్..
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 19వ ఓవర్‌‌లో చివరి మూడు బంతులకు వరుసగా అషుతోష్ శర్మ(17), కుల్దీప్ యాదవ్(1), మోహిత్ శర్మ(0) రనౌటవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. చివరి 12 బంతుల్లో ఢిల్లీ విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. అషుతోష్ శర్మ క్రీజులో ఉండటంతో ఢిల్లీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. బుమ్రా వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతుల్లో రెండు బౌండరీలు బాదిన అషుతోష్ శర్మ.. నాలుగో బంతికి క్విక్ డబుల్ తీసే క్రమంలో రనౌటయ్యాడు.

విల్ జాక్స్ అద్భుతంగా బంతిని కీపర్ రికెల్టన్‌కు అందివ్వగా.. అషుతోష్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఆ మరుసటి బంతికి కుల్దీప్ యాదవ్ సైతం క్విక్ డబుల్ తీయబోయి రనౌటయ్యాడు. మోహిత్ శర్మ(0)ను సాంట్నర్ సూపర్ త్రోతో రనౌట్ చేయడంతో ముంబై ఇండియన్స్ విజయం లాంఛనమైంది.

టర్నింగ్ పాయింట్ అదే..
ఓపెనర్ జేక్ ఫ్రెజర్ గోల్డెన్ డక్ అయినా.. కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కానీ కర్ణ్ శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడదీసాడు. అభిషేక్ పోరెల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే కరుణ్ నాయర్‌ను మిచెల్ సాంట్నర్ ఔట్ చేయగా.. అక్షర్ పటేల్‌(9)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ట్రిస్టన్ స్టబ్స్(1), కేఎల్ రాహుల్‌(15)లను కరుణ్ శర్మ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పాడు.

Story first published: Sunday, April 13, 2025, 23:36 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+