Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా..?

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడా? కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ తరహాలో.. బుమ్రాతో ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ చేయించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

DC vs MI IPL 2024 Jasprit Bumrah To Open With Rohit Sharma

ఈ మ్యాచ్‌ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశమైంది. నెట్స్‌లో గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో అతన్ని ఓపెనర్‌గా ఆడిస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఇక నెట్స్‌లో బుమ్రా భారీ షాట్స్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం.

స్వీప్, రివర్స్ స్వీప్, కవర్ డ్రైవ్స్, లాఫ్టెడ్, పుల్ షాట్స్‌ను బుమ్రా స్పెషల్‌గా ప్రాక్టీస్ చేశాడు. బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతున్న బుమ్రా.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటితే అతనికి తిరుగుండదు. బుమ్రాకు భారీ షాట్స్ ఆడే సామర్థ్యం ఉంది. టెస్ట్‌ల్లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 6.38 ఎకానమీతో 13 వికెట్లు తీసాడు. అత్యుత్తమ ప్రదర్శన 5/21 కావడం విశేషం. బ్యాటర్లు రాజ్యమేలుతున్న ఈ సీజన్‌లో అత్యంత స్వల్ప ఎకానమీ నమోదు చేసిన ఏకైక బౌలర్ బుమ్రా కావడం విశేషం. ఈ 8 మ్యాచ్‌ల్లో బుమ్రా 32 ఓవర్లు వేసి 204 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాని బుమ్రా 100 స్ట్రైక్‌రేట్‌తో 11 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 8 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు చివరి 6 మ్యాచ్‌ల్లో కనీసం 5 మ్యాచ్‌లు గెలవాలి.

Story first published: Friday, April 26, 2024, 16:07 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+