Ashutosh Sharma: ఎవడ్రా వీడు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు!
అశుతోష్ శర్మ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఓటమి ఖాయమైన పరిస్థితుల్లో సంచలన బ్యాటింగ్‌తో అసాధారణ విజయాన్నందించాడు. కళ్లు చెదిరే సిక్సర్లతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా.. అశుతోష్ శర్మ గురించే మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అశుతోష్ శర్మ.. అజేయ హాఫ్ సెంచరీతో ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
గత సీజన్‌లోనే ఇలాంటి మెరుపులే మెరిపించిన అశుతోష్ శర్మ.. తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఫినిషర్‌గా తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. ఢిల్లీకి మరిచిపోలేని విజయాన్నందించాడు. కొన్ని తరాలు ఈ విజయం గురించి మాట్లాడుకునేలా చేశాడు.

అంపైర్ టూ ఐపీఎల్ ఫినిషర్..
అందరిలానే అశుతోష్ శర్మ.. కూడా కష్టాల్లో నుంచే స్టార్‌గా ఎదిగాడు. మధ్యప్రదేశ్‌లోని రాట్లమ్‌లో పుట్టిన అశుతోష్ శర్మ.. క్రికెటర్ కావాలనే తన కల కోసం ఇండోర్‌కు వెళ్లాడు. తన కల నెరవేర్చుకునే సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు లోకల్ టోర్నీల్లో అంపైరింగ్ చేయడంతో పాటు.. చిన్న చితక పనులు చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున అండర్ 16, అండర్ 19తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో పెద్దగా రాణించకపోవడంతో అతనికి ఎక్కువగా అవకాశాలు లభించలేదు. టీ20ల్లో రాణించినా.. గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత అతను రైల్వేస్ జట్టుకు ఎంపికయ్యాడు.
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..
2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 12 బంతుల అర్థ శతకం రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. దాంతో తొలిసారి అతని పేరు భారత క్రికెట్ వర్గాల్లో వినిపించింది. అతని బ్యాటింగ్‌కు ఫిదా అయిన పంజాబ్ కింగ్స్ ట్రయల్స్‌కు ఆహ్వానించి జట్టులోకి తీసుకుంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసి అశుతోష్ శర్మ.. శశాంక్ సింగ్‌తో కలిసి సంచలన బ్యాటింగ్ చేశాడు.
పంజాబ్ బ్లండర్ మిస్టేక్..
250 ప్లస్ టార్గెట్‌ను పంజాబ్ చేజింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరికొన్ని మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించినా.. పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. కానీ అతని బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. ఆ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 167.26 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేశాడు. అయితే ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2025 మెగా వేలానికి అశుతోష్‌ను పంజాబ్ కింగ్స్ విడుదుల చేసింది. దాంతో వేలంలో అతను భారీ ధర పలుకుతాడని అంతా భావించారు. కానీ ఢిల్లీ 3.8 కోట్లకే దక్కించుకుంది.
అశుతోష్‌ను ఎలాగైనా కొనుగోలు చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించిందని ఆ జట్టు డైరెక్టర్ వేణుగోపాల్ రావు తాజాగా వెల్లడించారు. మెగా వేలంలో అతను రూ.10 కోట్ల వరకు పలుకుతాడని అనుకున్నామని, కానీ తమకు చాలా తక్కువ ధరకే సొంతమయ్యాడని సంతోషం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications