ఐపీఎల్ 2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించాడు. తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు తీసాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్(1)తో పాటు అభిషేక్ పోరెల్(0)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వాస్తవానికి ఐపీఎల్ 2025 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్ అన్‌సోల్డ్‌గా నిలిచాడు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో అతను ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడాలనుకున్నాడు. ఎస్సెక్స్ టీమ్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. అయితే అతనికి ఐపీఎల్ 2025 సీజన్ అనూహ్య అవకాశం దక్కింది.

లక్నో సూపర్ జెయింట్స్ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది. అతని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు లక్నో జట్టులోకి తీసుకుంది. తొలి మ్యాచ్‌కు ముందే జట్టుతో కలిసిన శార్దూల్.. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన ప్రదర్శనతో ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడు.
భారత జట్టులోనూ చోటు కోల్పోయిన శార్దూల్ ఠాకూర్.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. ముంబై జట్టు తరఫున రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. అయితే గాయాలతో బాధపడటంతో వేలంలో ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు.
ఈ మ్యాచ్ ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిచెల్ మార్ష్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72), నికోలస్ పూరన్(30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 75) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/42) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసారు.