Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs LSG: మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ విధ్వంసం!

ఐపీఎల్ 2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. మిచెల్ మార్ష్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72), నికోలస్ పూరన్(30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 75) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/42) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 250 ప్లస్ స్కోర్ చేస్తుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు.

DC vs LSG Nicholas Pooran and Mitchell Marsh helps Lucknow post 209 8

మిచెల్, పూరన్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. మిచెల్ మార్ష్ భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఎయిడెన్ మార్క్‌రమ్(15) ఔటైనా.. నికోలస్ పూరన్‌తో కలిసి ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దాంతో పవర్ ప్లేలోనే లక్నో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. పోటాపోటీగా బౌండరీలు బాదిన నికోలస్ పూరన్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు..
దాంతో లక్నో 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముఖేష్ కుమార్ విడదీసాడు. సెంచరీ దిశగా సాగుతున్న మిచెల్ మార్ష్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ డకౌటవ్వగా.. పూరన్‌ను స్టార్క్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో లక్నో పరుగుల వేగం తగ్గింది. ఆయుష్ బదోని(4), శార్దూల్ ఠాకూర్(0), షెహ్‌బాజ్ అహ్మద్(9), రవి బిష్ణోయ్(0) తీవ్రంగా నిరాశపరిచారు. శార్దూల్ ఠాకూర్ రనౌట్.. లక్నో కొంపముంచింది. డేవిడ్ మిల్లర్(27 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.

Story first published: Monday, March 24, 2025, 21:28 [IST]
Other articles published on Mar 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+