DC vs LSG:ఢిల్లీ కొంపముంచిన బాధ్యతారాహిత్యం.. లక్నో అద్భుత విజయం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), దీపక్ హుడా(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసింది. అక్షర్ పటేల్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 42 నాటౌట్), రిషభ్ పంత్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 44), మిచెల్ మార్ష్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బ్యాటర్ల ఉరుకులాట ఆ జట్టు ఓటమికి కారణమైంది. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీసారు. ఈ విజయంలో లక్నో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది.
ఓపెనర్లు విఫలం..
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. దుష్మంత్ చమీరా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పృథ్వీ షా(5) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి డేవిడ్ వార్నర్(3) బలయ్యాడు. మోహ్‌సిన్ ఖాన్ బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఫార్వార్డ్ క్యాచ్‌ను బదోని అద్భుతంగా అందుకున్నాడు. అయితే అతను బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు అనిపించింది. కానీ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
పంత్ ఉరుకులాట..
పవర్ ప్లే అనంతరం మిచెల్ మార్ష్, పంత్ ధాటిగా ఆడారు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని కృష్ణప్ప గౌతమ్ విడదీసాడు. మిచెల్ మార్ష్(37)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే మిచెల్ బ్యాట్‌కు బంతికి తాకలేదని రిప్లేలో స్పష్టమైంది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్(3) సైతం విఫలమయ్యాడు. క్రీజులోకి వచ్చిన రోవ్‌మన్ పొవెల్‌తో పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి.అయితే హాఫ్ సెంచరీకి చేరువైన పంత్‌ను మోహ్‌సిన్ ఖాన్ స్లోయర్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ధాటిగా ఆడలేక..
ఆ కొద్ది సేపటికే భారీ షాట్‌కు ప్రయత్నించిన రోవ్‌మన్ పొవెల్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ లక్నో వైపు మళ్లింది. అయితే ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. కుల్దీప్ భారీ సిక్సర్‌తో ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత కట్టుదిట్టంగా వేయడంతో లక్నో విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications