Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs LSG: టాస్ గెలిచిన ఢిల్లీ.. స్టార్ బ్యాటర్ దూరం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. డ్యూ నేపథ్యంలో మేం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే ముందుగా బౌలింగ్ చేస్తున్నాం. గతంలో నేను పంత్‌తో కలిసి ఆడాను. నా గురించి అతనికి.. పంత్ గురించి నాకు బాగా తెలుసు. మా వ్యూహాలు ఎలాంటి ఉంటాయో ఇద్దరికి తెలుసు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున చాలా మ్యాచ్‌లు ఆడాను. మా జట్టు సమతూకంగా ఉంది. ఇక్కడ కొన్నిసార్లు డ్యూ వచ్చింది. గత మూడేళ్లుగా నేను ఢిల్లీ తరఫున ఆడుతున్నాను. లీడర్‌షిప్‌ గ్రూప్‌లో ఒకడిగా ఉన్నాను. అందుకు తగ్గట్లే నేను పనిచేయాల్సి ఉంది. ఓ లీడర్‌లా ఆలోచించాలి. ఫాఫ్ డుప్లెసిస్, స్టబ్స్, స్టార్క్, ఫ్రెజర్ మెక్‌గర్క్ మా ఓవర్‌సీస్ ఆటగాళ్లు.'అని అక్షర్ పటేల్ తెలిపాడు.

DC vs LSG IPL 2025 KL Rahul misses first match Delhi opt to bowl in Vizag

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. 'నేను కూడా బౌలింగ్ ఎంచుకోవాలని అనుకున్నాను. కానీ బ్యాటింగ్‌‌కు కూడా ఈ వికెట్ అనుకూలంగానే ఉంటుంది. బాగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేయాలి. నా కెరీర్ మొత్తం నేను ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఆడాను. అక్కడ నాకు ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సీజన్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. ప్రతీ ఒక్కరు ఫామ్‌లోనే ఉన్నారు. మార్క్‌రమ్, మార్ష్, పూరన్, మిల్లర్ ఓవర్‌సీస్ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. తన సతీమణి అతియ శెట్టి డెలివరీ కోసం అతను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తుది జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

ఢిల్లీ క్యాపిటల్స్ : జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.

Story first published: Monday, March 24, 2025, 19:22 [IST]
Other articles published on Mar 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+