Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs LSG: థర్డ్ అంపైర్ తప్పిదం.. డేవిడ్ వార్నర్ బలి! కళ్లు దొబ్బాయా? అంటూ ఫ్యాన్స్ ఫైర్!

DC vs LSG: Fans Slam Third Umpire For Controversial David Waners Dismissal

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైరింగ్ తప్పిదాలు కొనసాగుతున్నాయి. థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ మూల్యం చెల్లించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తప్పిదానికి ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఉన్నా థర్డ్ అంపైర్ అత్యుత్సాహంతో తన నిర్ణయాన్ని ప్రకటించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఔట్? నాటౌట్ కానీ స్పష్టత లేకుండానే నిర్ణయం తీసుకున్నాడు. దాంతో క్రికెట్ అభిమానులు చెత్త అంపైరింగ్ అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది.

ఏం జరిగిందంటే..?

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా మోహ్‌సిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని మోహ్‌సిన్ ఖాన్ లెంగ్త్ బాల్‌గా వేయగా.. డేవిడ్ వార్నర్ పుల్ చేశాడు. అయితే బ్యాట్ అంచున తాకిన బంతి ఫార్వార్డ్ ఫీల్డర్ బదోనివైపు దూసుకెళ్లింది. ఈ బంతిని బదోని అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో అది నేలకు తాకినట్లు అనిపించింది. డేవిడ్ వార్నర్ సైతం ఇదే విషయాన్ని అంపైర్లకు తెలియజేశాడు. థర్డ్ అంపైర్ సమీక్ష తీసుకోగా.. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి ఔట్‌‌గా ప్రకటించాడు.

క్లారిటీ లేకున్నా..

బంతి కింద ఫీల్డర్ చేతులు ఉన్నాయని థర్డ్ అంపైర్ చెప్పాడు. అయితే రీప్లేలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది. కానీ క్లారిటీ లేదు. ఇంకాస్త బెటర్ యాంగిల్‌లో చూడాల్సింది. కానీ థర్డ్ అంపైర్ ఫీల్డర్‌కే క్రెడిట్ ఇస్తూ ఔటిచ్చాడు. వాస్తవానికి బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మన్ కింద నాటౌటివ్వాల్సింది. మొత్తానికి అంపైర్ తప్పిదం కారణంగా డేవిడ్ వార్నర్(3) నిరాశగా పెవిలియన్ చేరాడు.

కళ్లు దొబ్బాయా?

ఇక ఈ నిర్ణయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ అంపైర్ కళ్లు దొబ్బాయా? అని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అంత స్పష్టంగా బంతి నేలకు తాకినట్లు కనిపిస్తుంటే చేతి వేళ్లు ఉన్నాయని ఎలా చెబుతున్నాడని మండిపడుతున్నారు. అత్యంత చెత్త అంపైరింగ్ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చెత్త అంపైరింగ్ చూసాక మ్యాచ్‌లు చూడాలనే ఉత్సాహం కూడా పోతుందని కామెంట్ చేస్తున్నారు. టెక్నాలజీని మరింత వాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

చెలరేగిన రాహుల్..

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), దీపక్ హుడా(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 10 ఓవర్లలో 4 వికెట్లకు 94 పరుగులు చేసింది.

Story first published: Sunday, May 1, 2022, 19:00 [IST]
Other articles published on May 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+