For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs KKR: ఒకే ఓవర్లో 6, 6, 4,0, 6, 4 (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. సునామీ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లో సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 6, 6, 4,0, 6, 4 బాది 26 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని ఓవర్ మీడాఫ్ దిశగా సిక్స్ బాదిన నరైన్.. రెండో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ తరలించాడు. లో-ఫుల్‌టాస్‌గా వేసిన మూడో బంతిని డ్రైవ్ షాట్‌తో బౌండరీ రాబట్టాడు.

నాలుగో బంతిని డాట్ చేసిన నరైన్.. ఐదో బంతిని ఓవర్ వైడ్ మిడాఫ్ దిశగా సిక్సర్ బాదాడు. చివరి బంతి నరైన్ బ్యాట్ ఎడ్జ్ తాకి బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా బౌండరీకి వెళ్లిపోయింది. తుఫానులా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకపడి ఆ జట్టుకు చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోయాడు.

సునీల్ నరైన్ ధాటికి కేకేఆర్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. అనంతరం అదే జోరును కొనసాగించడంతో కేకేఆర్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన మూడో జట్టుగా నిలిచింది.

DC vs KKR Sunil Narine smashes Ishant Sharma as the batter hits 26 runs in an over Video goes viral

విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా సాగిన సునీల్ నరైన్‌కు మిచెల్ మార్ష్ కళ్లెం వేసాడు. క్రాస్ సీమ్‌ షాట్ పిచ్ బాల్‌తో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్‌(18)తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించిన నరైన్.. రఘు వంశీ(54)తో కలిసి రెండో వికెట్‌కు 1064 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

Story first published: Wednesday, April 3, 2024, 20:56 [IST]
Other articles published on Apr 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+