DC vs KKR: అదే మా కొంపముంచింది: రిషభ్ పంత్
బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ 106 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. ఈ రోజు తమకు ఏది కలిసి రాలేదన్నాడు. బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని, ఈ తప్పిదాలను సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్దమవుతామని తెలిపాడు.

'మా బౌలర్లు అన్ని విధాల ప్రయత్నించారు. కానీ మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మలుచుకోలేకపోయాం. బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. కానీ ఈ రోజు మాకు ఏది కలిసి రాలేదు. భారీ లక్ష్యచేధనలో ఆలౌటైనా సరే.. దూకుడుగానే ఆడాలనుకున్నాం. ఈ మ్యాచ్‌లో మేం కొన్ని రివ్యూలను తీసుకోలేకపోయాం.
ప్రేక్షకుల గోలతో పాటు స్క్రీన్‌పై టైమర్‌ను సరిగ్గా చూడలేకపోయాం. స్క్రీన్‌లో కొంత సాంకేతిక సమస్య కూడా ఉంది. అయితే కొన్ని విషయాలు మన నియంత్రణలో లేనివి. వాటికి మనం ఏం చేయలేం. స్పిన్నర్లతో బౌలింగ్ చేయవద్దని భావించే అక్షర్ పటేల్‌కు ఒక్క ఓవర్ మాత్రమే ఇచ్చాం. మా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగానే బౌలింగ్ చేశారు.
ఈ పరాజయం ఒక్క గుణపాఠంగా భావిస్తున్నాను. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి మ్యాచ్‌లో సానుకూలంగా బరిలోకి దిగుతాం. నేను ఫిట్‌గా ఉన్నాను. ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత ప్రతీ రోజును ఆస్వాదిస్తున్నాను. అయితే క్రికెట్‌లో ఒడిదొడుకులు సహజం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.
కెప్టెన్ రిషభ్ పంత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications