
పృథ్వీ షా షో..
155 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ పృథ్వీ షా మెరుపు ఆరంభాన్ని అందిచ్చాడు. శివం మావి వేసిన ఫస్ట్ ఓవర్‌లో వైడ్‌తో సహా 6 బంతులకు 6 ఫోర్లు కొట్టి 25 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అనంతరం షా అదే జోరు కనబర్చడంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 67 రన్స్ చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్. అనంతరం కమిన్స్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన పృథ్వీ షా 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ధావన్ హాఫ్ సెంచరీ మిస్..
ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. మరోవైపు శిఖర్ ధావన్ నిదానంగా ఆడుతూ.. పృథ్వీ షాకు అండగా నిలిచాడు. షా ధాటికి ఢిల్లీ 10 ఓవర్లలోనే 95 రన్స్ చేసింది. ప్రతీ ఓవర్‌లో బౌండరీ రాబట్టిన ఈ జోడీ మ్యాచ్‌ను మొత్తం తమవైపు తిప్పుకుంది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శిఖర్ ధావన్.. కమిన్స్ వేసిన 14వ ఓవర్ 5వ బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 132 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

విన్నింగ్ షాట్‌తో
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్.. ప్రసిధ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టడంతో విజయ సమీకరణం 30 బంతుల్లో 9 పరుగులుగా మారింది. అయితే కమిన్స్ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన పృథ్వీ షా.. నితీష్ రాణా సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. క్రీజలోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్‌తో కలిసి పంత్ మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశాడు. కానీ బౌండరీ లైన్ వద్ద శివం మావికి చిక్కి వెనుదిరిగాడు. దాంతో హెట్‌మైర్ క్రీజులోకి రాగా.. స్టోయినిస్ ఫోర్‌తో ఢిల్లీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు


Click it and Unblock the Notifications
