
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 6 ఫోర్లు కొట్టి.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. పృథ్వీ షా కన్నా ముందు అతని సహచర ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ అజింక్యా రహానే ఈ ఘనతను అందుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లో ఈ ఘనతను అందుకున్న తొలి ఆటగాడు మాత్రం పృథ్వీ షానే.
శివం మావీ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే పృథ్వీ షా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఓవర్‌ను శివం మావి వైడ్‌తో ప్రారంభించగా.. ఫస్ట్ బాల్‌ను షా.. స్ట్రెట్ డ్రైవ్‌తో బౌండరీ రాబట్టాడు. ఇక సెకండ్ బౌండరీనీ లెగ్ సైడ్ ఫ్లిక్ షాట్‌తో రాబట్టగా.. మూడో బౌండరీని కవర్ డ్రైవ్ దిశగా సాధించాడు. మావీ స్లోయర్ ఫుల్ టాస్ వేయగా.. ఆ బంతిని స్టన్నింగ్ కవర్‌డ్రైవ్‌గా బౌండరీ తరలించాడు. ఐదో బంతిని షార్ట్ వైడ్‌గా వేయగా.. డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ సాధించాడు. ఆ తర్వాత బంతిని కూడా బౌండరీ కొట్టి మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు.
ఇక షా ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 67 రన్స్ చేసింది. దాంతో ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఢిల్లీ తన రికార్డును మెరుగుపరుచుకుంది. ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ పవర్ ప్లేలో 65/0 చేసింది. ఆ తర్వాత సీఎస్‌కేపై ఆర్‌సీబీ పవర్ ప్లేలో 65/2 పరుగులు చేయగా.. పంజాబ్‌పై ఢిల్లీ 62/1 చేసింది.
ఈ మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించిన పృథ్వీ షా కమిన్స్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా..ఢిల్లీ తరఫున ఓవరాల్‌గా మూడోది. ఢిల్లీ తరఫున క్రిస్ మోరీస్ 2016లో గుజరాత్ లయన్స్‌పై 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 2019లో పంత్ కూడా ముంబైపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక పృథ్వీ షా(38 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్ పట్ల అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ సెహ్వాగ్ గారు ఏంటీ ఆ ఆవేశం అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.