Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR: చెలరేగిన కుల్దీప్, ముస్తాఫిజుర్.. ఆదుకున్న రాణా.. ఢిల్లీ ముందు ఈజీ టార్గెట్!

DC vs KKR: Kuldeep Yadavs 4/14 restrict Kolkata Knight Riders to 146/9

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా(34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో కేకేఆర్ ప్రత్యర్థి ముందు 147 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/14), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) చెలరేగడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. నితీశ్ రాణాకు తోడుగా శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించడంతో కేకేఆర్ పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. చివర్లో రింకూ సింగ్(23) రాణించగా.. ఆఖరి ఓవర్‌లో ముస్తాఫిజుర్ దెబ్బతీసాడు. 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. చేతన్ సకారియా, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

 శుభారంభం లేదు..

శుభారంభం లేదు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ ఆడుతున్న చేతన్ సకారియా తన తొలి ఓవర్‌లోనే ఆరోన్ ఫించ్(3)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే వెంకటేశ్ అయ్యర్‌(6)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే అనంతరం కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కేకేఆర్ దెబ్బతీసాడు. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన బాబా ఇంద్రజీత్(6) బంగారం లాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు.

 దెబ్బతీసిన కుల్దీప్..

దెబ్బతీసిన కుల్దీప్..

ఆ మరుసటి బంతికే సునీల్ నరైన్(0) ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో 35 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కోల్‌కతా పీకల్లోతు కష్టాలో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి నితీశ్ రాణాతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన శ్రేయస్ అయ్యర్‌ను రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 5వ వికెట్‌కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్‌లో డేంజరస్ ఆండ్రీ రస్సెల్‌ను కుల్దీప్ స్టంపౌట్ చేశాడు.

 ఆదుకున్న నితీశ్ రాణా..

ఆదుకున్న నితీశ్ రాణా..

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌తో కలిసి నితీశ్ రాణా పోరాడాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్ భారీ సిక్సర్ బాదిన నితీశ్ రాణా 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముస్తాఫిజుర్ వేసిన చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రింక్యూ సింగ్(23) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే నితీష్ రాణా సైతం భారీ షాట్‌కు ప్రయత్నించగా.. సకారియా స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే టీమ్ సౌథీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో చివరి ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.

Story first published: Thursday, April 28, 2022, 21:43 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+