Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR: ఢిల్లీ చేతిలో పరాజయం.. కోల్‌కతా ఓటమికి మూడు కారణాలివే!!

DC vs KKR: KKR committed a few mistakes tactically in this match

షార్జా: శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 229 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఓటమిని చవిచూసింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమయినా.. ఇయాన్ మోర్గాన్‌ (44; 18 బంతుల్లో ఒక ఫోర్‌, 5 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (36;16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సలర్లు) రాణించారు.

ఇద్దరూ దాదాపు విజయపుటంచుల వరకూ తీసుకెళ్లారు. కానీ చివరలో ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. ప్రధానంగా ఓ మూడు తప్పిదాలు చేసిన కోల్‌కతా.. ఓటమిని కొని తెచ్చుకుంది. అవేంటో ఓసారి చూద్దాం.

మొదట బ్యాటింగ్ చేసుంటే

మొదట బ్యాటింగ్ చేసుంటే

ఐపీఎల్ 2020‌లో ఛేజింగ్‌కు దిగిన జట్లను దాదాపు విజయం వరించట్లేదు. షార్జా లాంటి బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ మీద టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకొని భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచుతే బాగుండేది. కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి దినేష్ కార్తీక్ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ ఢిల్లీ 228 రన్స్ చేసింది. భారీ లక్ష్యం ముందుండడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలో వికెట్లను కోల్పోయారు. ఒకవేళ కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసుంటే.. ఢిల్లీ ఆటగాళ్లు ఒత్తిడిలో పడేవారేమో.

కుల్దీప్ బదులు

కుల్దీప్ బదులు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో ఓ బ్యాట్స్‌మెన్ తక్కువగా ఉన్న లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకుంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బదులు రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకున్నాడు కెప్టెన్ కార్తీక్. త్రిపాఠిని బాగానే ఆడాడు. అతడు తీసుకున్నందుకు న్యాయం కూడా చేశాడు. అయితే కుల్దీప్‌ను కాకుండా.. మరోకరిని పక్కనపెట్టాల్సి ఉండే. ఓ బౌలర్ తగ్గడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కోల్‌కతాపై చెలరేగిపోయారు. కుల్దీప్ ఉంటే ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కాస్తయినా ఆపేవాడు. స్కోర్ 200 దాటేది కాదేమో?!!.

నరైన్ విఫలం అవుతున్నా

నరైన్ విఫలం అవుతున్నా

తాత్కాలిక ఓపెనర్ సునీల్ నరైన్ పదే పదే విఫలం అవుతున్నా.. దినేశ్ కార్తీక్ మాత్రం అతడిపై నమ్మకం ఉంచుతున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో నరైన్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. స్టార్ స్పిన్నర్ అయిన నరైన్.. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు. ఫామ్‌లో లేని నరైన్‌ను ఓపెనర్‌గా పంపడంతో ఆదిలోనే వికెట్ కోల్పోతుంది కోల్‌కతా. భారం వచ్చే ఆటగాడిపై పడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లకు అతడిని పక్కన పెట్టి.. ఓపెనర్‌గా మరొకరిని పంపిస్తే శుభారంభాలు దక్కుతాయి.

కార్తీక్ ఫామ్ ఆందోళనకరం

కార్తీక్ ఫామ్ ఆందోళనకరం

ఫామ్‌లో ఉన్న ఇయాన్ మోర్గాన్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపితే.. చివరలో భారీ షాట్లు ఆడేందుకు వీలవుతుంది. ఇక కెప్టెన్ దినేశ్ కార్తీక్ పరుగులు చేయడంలో విఫలం అవుతున్నాడు. కార్తీక్ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సారథ్యంలో కూడా కార్తీక్ తేలిపోతున్నాడు. కమలేష్ నాగర్‌కోటి ఇంకో ఓవర్ వేయాల్సి ఉన్నా.. డెత్ ఓవర్లో లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కార్తీక్ బౌలింగ్ చేయించాడు. బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ రోటేషన్ విషయంలోనూ తడబడుతున్నాడు. ఇది కూడా కోల్‌కతా ఓటమికి ఓ కారణం.

DC vs KKR: కోల్‌కతా ఓటమిపై దినేశ్‌ కార్తీక్‌ ఏమన్నాడంటే?!!

Story first published: Sunday, October 4, 2020, 10:37 [IST]
Other articles published on Oct 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+