Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR: కోల్‌కతా ఓటమిపై దినేశ్‌ కార్తీక్‌ ఏమన్నాడంటే?!!

DC vs KKR: Dinesh Karthik Hints at Changes top the Order after Poor Show
IPL 2020,DC vs KKR : Dinesh Karthik Over Match Loss Against Delhi Capitals

షార్జా: మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ తమ జట్టు ఆటగాళ్ల పోరాట పటిమకు గర్వపడుతున్నానని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 229 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఓటమి పాలైంది. ఇయాన్ మోర్గాన్‌ (44; 18 బంతుల్లో ఒక ఫోర్‌, 5 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (36;16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సలర్లు) రాణించారు. ఇద్దరూ దాదాపు విజయపుటంచుల వరకూ తీసుకెళ్లారు. కానీ ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.

మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ... 'ఆఖరి వరకూ పోరాడటమే మా జట్టు స్వభావం. గత మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మా ఆటగాళ్ల ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నా. వరుసగా వికెట్లు కోల్పోవడం మా జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్‌ 10 నుంచి 13 ఓవర్లలో ఎక్కువగా బౌండరీలు సాధించలేకపోయాం. మేం ఇంకా మరిన్ని సిక్సర్లు కొట్టాల్సింది. ఇది బౌలింగ్‌కు ప్రతికూలమైన మైదానం‌. మా బౌలర్లు బాగానే బౌలింగ్‌ చేశారు. ఆండ్రి రసెల్‌ మీద మాకు విశ్వాసం ఉంది. జట్టు బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌లో మార్పులు చేయాలనే ఆలోచన నాకు రాలేదు. కానీ ఈ మ్యాచ్ తర్వాత కోచ్‌ స్టాఫ్‌తో మాట్లాడి మార్పులపై నిర్ణయం తీసుకుంటాం' అని అన్నాడు.

భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్‌లో సునీల్‌ నరేన్ ‌(3) ఔట్‌ అయ్యాడు. సీనియర్‌ స్పిన్నర్‌ ఆర్ అశ్విన్‌ వేసిన మూడో ఓవర్‌లో నితీశ్‌ రాణా రెండు సిక్సర్లు బాదాడు. శుభ్‌మన్‌ గిల్‌ (22 బంతుల్లో 28) కూడా దూకుడుగా ఆడడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 59 పరుగులు చేసింది. అమిత్‌ మిశ్రా తొమ్మిదో ఓవర్లో గిల్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రబాడ ఓవర్లో భీకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రసెల్‌ (8 బంతుల్లో 13) ఔట్‌ కావడంతో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అప్పటి వరకు ఒంటరి పోరాటం చేసిన రాణాను..‌ దినేశ్‌ కార్తీక్‌ (6)ను హర్షల్‌ పటేల్‌ 13వ ఓవర్లో వరుస బంతుల్లో ఔట్‌ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. కొద్ది సేపటికే ప్యాట్ కమిన్స్ ‌(5)ను నోర్జే పెవిలియన్‌కు పంపాడు.

ఇక చివరి ఐదు ఓవర్లకు 92 పరుగులు చేయాల్సిన దశలో ఇయాన్‌ మోర్గాన్‌ చెలరేగాడు. మరోవైపు 17 ఓవర్లో రాహుల్‌ త్రిపాఠి మూడు సిక్సర్లు బాదడంతో ఒక్కసారిగా సమీకరణం మారిపోయింది. ఆ వెంటనే రబాడ ఓవర్లో మోర్గాన్‌ మూడు సిక్సర్లతో 23 పరుగులు బాదాడు. దీంతో కోల్‌కతాకు 12 బంతుల్లో 31పరుగులు అవసరం అయ్యాయి. అయితే మోర్గాన్‌ను నోర్జే ఔట్‌ చేయడంతో కోల్‌కతా పరాజయం పాలైంది.

Story first published: Sunday, October 4, 2020, 9:38 [IST]
Other articles published on Oct 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+