DC vs KKR: భారీ హిట్టర్ రసెల్‌ను ఔట్ చేసేందుకు.. అయ్యర్ పన్నిన వ్యూహం ఏంటో తెలుసా?

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టులో హిట్టర్ల సంఖ్య బాగానే ఉంది. అందులో అత్యంత ప్రమాదకర ఆటగాడు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రి రసెల్. తనదైన రోజున రసెల్ ఎలా విధ్వంసం సృష్టిస్తాడో మనకు తెలిసిన విషయమే. ఒక్క ఓవర్లోనే మ్యాచ్‌లను మలుపు తిప్పుతాడు. ఇక భారీ లక్ష్య చేధనలు, స్లాగ్ ఓవర్లలో అయితే ఈ విండీస్ వీరుడి విధ్వంసం మరో స్థాయిలో ఉంటుంది.
2019 ఐపీఎల్‌లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. పరాజయం అంచున నిలిచిన ప్రతీసారి తన విధ్వంసకర ఆటతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ సీజన్‌లో 204.81 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థ సెంచరీలు ఉన్నాయి.

అయ్యర్ వ్యూహం
శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు ఏకంగా 229 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. దీంతో కేకేఆర్ సారథి దినేష్ కార్తీక్.. ఆండ్రి రసెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందు పంపే అవకాశముందని ఢిల్లీ క్యాపిటల్స్ ముందే గ్రహించింది. అతడిని ఔట్ చేసేందుకు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుత వ్యూహం పన్నాడు. ఆ వ్యూహం ఢిల్లీకి బాగానే కలిసొచ్చింది. అయ్యర్ పన్నిన వ్యూహంలో రసెల్ పడ్డాడు. కీలక సమయంలో రసెల్ 8 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

రంగంలోకి రబాడ
ఆండ్రి రసెల్ మంచి వేగం ఉన్న పేసర్లను ఆడలేడు. స్పిన్, మీడియం పేస్ అంటే మాత్రం చెలరేగిపోతాడు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పేసర్ కాగిసో రబాడతో ఆరంభంలో ఒకే ఒక్క ఓవర్ వేయించాడు శ్రేయాస్ అయ్యర్. తర్వాత తొమ్మిదో ఓవర్లో రసెల్ బ్యాటింగ్‌కు రావడమే ఆలస్యం.. తర్వాతి ఓవర్లో రబాడను రంగంలోకి దించాడు. అప్పటికే రెండు భారీ షాట్లు ఆడిన రసెల్.. రబాడ బౌలింగ్‌లోనూ అలాగే షాట్లు ఆడాలని చూశాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్‌మ్యాన్ స్థానంలో ఉన్న అన్రిచ్ నార్జె చేతికి చిక్కింది. దీంతో రసెల్ కథ ముగిసింది.

రసెల్ ఔట్
భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్‌లో సునీల్ నరేన్ (3) ఔట్ అయ్యాడు. సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ వేసిన మూడో ఓవర్‌లో నితీశ్ రాణా రెండు సిక్సర్లు బాదాడు. శుభ్‌మన్ గిల్ (22 బంతుల్లో 28) కూడా దూకుడుగా ఆడడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 59 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా తొమ్మిదో ఓవర్లో గిల్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రబాడ ఓవర్లో భీకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 13) ఔట్ కావడంతో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అప్పటి వరకు ఒంటరి పోరాటం చేసిన రాణాను.. దినేశ్ కార్తీక్ (6)ను హర్షల్ పటేల్ 13వ ఓవర్లో వరుస బంతుల్లో ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. కొద్ది సేపటికే ప్యాట్ కమిన్స్ (5)ను నోర్జే పెవిలియన్‌కు పంపాడు.

12 బంతుల్లో 31పరుగులు
ఇక చివరి ఐదు ఓవర్లకు 92 పరుగులు చేయాల్సిన దశలో ఇయాన్ మోర్గాన్ చెలరేగాడు. మరోవైపు 17 ఓవర్లో రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 31) మూడు సిక్సర్లు బాదడంతో ఒక్కసారిగా సమీకరణం మారిపోయింది. ఆ వెంటనే రబాడ ఓవర్లో మోర్గాన్ మూడు సిక్సర్లతో 23 పరుగులు బాదాడు. దీంతో కోల్‌కతాకు 12 బంతుల్లో 31పరుగులు అవసరం అయ్యాయి. అయితే మోర్గాన్‌ను నోర్జే ఔట్ చేయడంతో కోల్‌కతా పరాజయం పాలైంది.
RCB vs RR: ఐపీఎల్ చరిత్రలో.. తొలి ఆటగాడిగా దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications