Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరి వల్లే ఈ సెంచరీ: ఫిన్ అలెన్

తమ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ సహకారంతోనే సెంచరీ సాధించానని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ తెలిపాడు. తుది జట్టులో చోటు కోల్పోవడం కూడా తనకు కలిసొచ్చిందని చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఫిన్ అలెన్(47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ దక్కింది.

జట్టు కోసం ఆడాను..

ఈ సందర్భంగా మాట్లాడిన ఫిన్ అలెన్.. 'నేను నా బ్యాటింగ్‌లో మరిన్ని కొత్త మెళకువలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మేం ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాం. అందుకే కొంచెం బాధ్యతగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి ఆ తర్వాత దూకుడుగా ఆడాలనుకున్నాను.

DC vs KKR Finn Allen Credits Shane Watson and Abhishek Nayar for Maiden IPL Century
Photo Credit: screen grab for JioHotstar

ఆరంభంలో పిచ్ కొంచెం సవాలుగా ఉంది. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశాడు. అందుకే క్రీజులో కుదురుకుని, ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాను. సిక్సర్ల బాదడం నా బ్యాటింగ్ శైలి.

వాట్సన్, అభిషేక్ నాయర్ సాయంతో..

బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు క్రీజులో ఉండటం ముఖ్యం. దీని కోసం నేను వాట్సన్, అభిషేక్ నాయర్‌లతో కలిసి పని చేస్తున్నాను. నాకు కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినా అవి పెద్ద స్కోర్లుగా మల్చలేకపోయాను. కానీ ఈ రోజు వ్యక్తిగతంగా విజయం సాధించడం సంతోషంగా ఉంది.

పరిస్థితిని బట్టి వ్యక్తిగత ప్రదర్శనను పక్కనపెట్టి, జట్టు అవసరానికి తగ్గట్టుగా ఆడాలి. నేను గనుక ఎక్కువ సేపు క్రీజులో ఉంటే విజయం సాధించవచ్చని నాకు తెలుసు. నేను ఎప్పుడూ కనీసం 40 బంతులు ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంటాను. అది తరచుగా జరగదు. కానీ ఈ రోజు అదే నన్ను ముందుకు నడిపించింది.

బ్రేక్ తీసుకోవడం కలిసొచ్చింది..

జట్టులో లేనప్పుడు మన ఆలోచనా దృక్పథం మారుతుంది. జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మానసికంగా రిఫ్రెష్ అవ్వడానికి సమయం దొరుకుతుంది. నిజం చెప్పాలంటే, ఆరంభంలో నాపై నేనే ఎక్కువ ఒత్తిడి పెంచుకున్నాను. అందుకే కొంచెం విరామం తీసుకుని.. రిఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి ఫామ్ అందుకున్నాను.'అని ఫిన్ అలెన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 9, 2026, 15:29 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+