ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 106 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.
సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. సునామీ ఇన్నింగ్స్‌తో పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది.

సునీల్ నరైన్‌కు తోడుగా.. అంగ్‌క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), రింకూ సింగ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించారు.
దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా కేకేఆర్ చరిత్రకెక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 272 పరుగుల రికార్డ్ స్కోర్‌కు 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బుల్లెట్ యార్కర్‌తో ఇషాంత్ శర్మ.. రస్సెల్‌ను ఔట్ చేసి సన్‌రైజర్స్ రికార్డ్‌ను కాపాడాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోకియా మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ చెరొక వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. కెప్టెన్ రిషభ్ పంత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(3/27), వరుణ్ చక్రవర్తీ(3/33) మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. రస్సెల్, నరైన్ తలో వికెట్ తీసారు.