
శుభారంభం దక్కలేదు..
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో ఓపెనర్ సునీల్ నరైన్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం శుభ్‌మన్ గిల్(28)తో కలిసి నితీష్ రాణా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ ఓవర్‌కు రెండు బౌండరీలతో ధాటిగా ఆడటంతో కోల్‌కతా పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది.
స్పిన్నర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తడబడిన ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైంది. ఈ క్రమంలో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో గిల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగడంతో రెండో వికెట్‌కు నమోదైన 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్‌లో ఫ్రీహిట్‌ను భారీ సిక్సర్‌గా మలిచిన రాణా.. 12 రన్స్ పిడుకున్నాడు.

నిరాశపరిచిన రస్సెల్..
ఇక రబడా బౌలింగ్‌లో బౌండరీ కొట్టి టచ్‌లోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్(13).. బాల్ వ్యవధిలో మరో భారీ సిక్సర్ కొట్టాడు. అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి థర్డ్ మ్యాన్‌లో నోర్జ్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. ఇక ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. స్టోయినిస్ వేసిన 12 ఓవర్ నాలుగో బంతిని ఆఫ్ కట్టర్‌గా బౌండరీ తరలించిన రాణా.. ఆ మరుసటి బంతి షార్ట్ మ్యాన్ దిశగా ఆడి సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
హర్దిక్ పటేల్ వేసిన మరుసటి ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టిన రాణా.. అదే జోరులో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే దినేశ్ కార్తీక్(6) కూడా ఔటవ్వడంతో కేకేఆర్ 117 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే కమిన్స్(5) కూడా ఔటవ్వడంతో కోల్‌కతా కష్టాలు రెట్టింపు అయ్యాయి.

చివర్లో చెలరేగిన మోర్గాన్.. త్రిపాఠి
ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మోర్గాన్, రాహుల్ త్రిపాఠి తొలుత నిదానంగా ఆడి ఆ తర్వాత గేరు మార్చారు. రబడా వేసిన 16 ఓవర్‌లో మోర్గాన్ 6,4తో 14 రన్స్ పిండుకోగా.. 17వ ఓవర్‌లో త్రిపాఠి మూడు సిక్స్‌లు, ఫోర్‌తో 24 రన్స్ రాబట్టి కేకేఆర్ శిభిరంలో ఆశలు రేకెత్తించారు. రబడా వేసిన 18 ఓవర్‌లో మోర్గాన్ హ్యాట్రిక్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. త్రిపాఠిని అంపైర్ ఔటివ్వగా.. రివ్యూకెళ్లి ఫలితం సాధించాడు.
ఆఖరి బంతిని బౌండరీకి తరలించడంతో కేకేఆర్ విజయానికి 12 బంతుల్లో 31 రన్స్ అవసరమయ్యాయి. నోర్జ్ వేసిన 19వ ఓవర్‌లో మోర్గాన్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ఏడో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఓవర్‌లో 5 రన్సే రావడంతో కోల్‌కతా విజయానికి ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమయ్యాయి. తొలి బౌండరీ కొట్టిన త్రిపాఠి.. మరుసటి బంతికే బౌల్ట్ అవ్వడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.


Click it and Unblock the Notifications












