Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తమ జట్టు ఛేజింగ్ రికార్డ్ బాగుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

టాస్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. చూస్తుంటే మంచి పిచ్‌లా కనిపిస్తోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం అద్భుతంగా లక్ష్యాలను అధిగమించాం. 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుండటం సంతోషంగా ఉంది. ఈ లీగ్‌లో నా ప్రయాణం ఇంకా చాలా ఉంది.

DC vs GT Rishabh Pant reveals the reason why David Warner not playing in IPL 2024 Match vs Gujarat

ఈ ఘనతలను నేను పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ఫోకస్ అంతా ప్రస్తుత మ్యాచ్‌పైనే ఉంది. క్రికెట్‌లో ఒడిదొడుకులు ఉండటం సహజం. బాగా ఆడితే అంతా బాగానే ఉంటుంది. మా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ ఓడి మంచిదైందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. 'టాస్ గెలిచినా మేం బ్యాటింగే తీసుకోవాలనుకున్నాం. ఓడినా బ్యాటింగే చేస్తున్నాం. మా ఆటగాళ్లకు ఒక్కటే చెప్పా.. ఎక్కువగా ఆలోచించకుండా జట్టుకు కావాల్సింది చేయడంపై ఫోకస్ పెట్టాలని తెలిపా.

ఈ వికెట్ గత మ్యాచ్ కంటే కాస్త నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తోంది. తేమ కీలక ప్రభావం చూపనుంది. గత మ్యాచ్‌లో అయితే మంచు రాలేదు. ఈ రోజు కూడా రాదనే అనుకుంటున్నా. జట్టులో రెండు మార్పులు చేశాం. డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్‌ను తప్పించి షై హోప్, సుమిత్ కుమార్‌లను తీసుకున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షై హోప్, రిషభ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్

Story first published: Wednesday, April 24, 2024, 19:36 [IST]
Other articles published on Apr 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+