Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs GT: లలిత్ యాదవ్ రనౌట్.. రూల్ తెలియక అంపైర్‌తో రిషభ్ పంత్ గొడవ!

DC vs GT: Rishabh Pant arguing with umpire after Lalit Yadav was given run out
IPL 2022 : Runout వివాదం.. Rishabh Pant కి ఈ రూల్ తెలీదా? | Oneindia Telugu

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసిన పంత్ సేన.. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్ కారణంగా ఓటమిపాలైంది. కీలక సమయంలో ఆ జట్టు బ్యాట్స్‌మన్ లలిత్ యాదవ్(25) రనౌటవ్వడం ఢిల్లీ ఓటమిని శాసించింది. అయితే ఈ రనౌట్ విషయంలో కెప్టెన్ రిషభ్ పంత్.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దాంతో ఈ రనౌట్‌పై కాసేపు మైదానంలో హైడ్రామా నడిచింది. చివరకు నిబంధనల గురించి పంత్‌కు అంపైర్లు సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

అసలేం జరిగిందంటే..?

లలిత్ యాదవ్‌ను రనౌట్ చేసే క్షణం ముందు వికెట్లకు గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తన పాదాన్ని తాకించాడు. దాంతో లైట్స్ వెలిగి.. ఒక బెయిల్ కింద పడిపోయింది. అయినప్పటికీ కంగారుపడని శంకర్ మిగిలిన ఒక బెయిల్‌ని ఎగరగొట్టి.. రనౌట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించాడు. అతను లలిత్ యాదవ్‌ని రనౌట్‌గా ప్రకటించాడు. రిప్లైను పరిశీలించిన థర్డ్ అంపైర్.. శంకర్ ఆ బెయిల్‌ని ఎగరగొట్టే సమయానికి లలిత్ యాదవ్ క్రీజులోకి రాకపోవడంతో రనౌట్‌ అయినట్లు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

ఫెయిర్ రనౌట్ కాదంటూ..

ఫెయిర్ రనౌట్ కాదంటూ..

దాంతో.. లలిత్ యాదవ్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కానీ.. రిషబ్ పంత్ అతన్ని వెనక్కి పిలిచి.. మైదానంలోని ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. రనౌట్ చేసే ముందు వికెట్లకు విజయ్ శంకర్ పాదాన్ని తాకించడం, ఒక బెయిల్ ముందే కింద పడిపోవడాన్ని అంపైర్లకి గుర్తు చేశాడు. ఇది ఫెయిర్ రనౌట్ కాదంటూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ.. మరొక బెయిల్ స్టంప్‌లపైనే ఉందనే విషయాన్ని పంత్‌కి వివరించిన అంపైర్లు.. లలిత్ యాదవ్ రనౌట్ అని తేల్చారు.

రూల్స్ ఏం చెప్తున్నాయంటే..?

రూల్స్ ఏం చెప్తున్నాయంటే..?

రనౌట్ కంటే ముందు స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్ రెండూ పడిపోతే.. నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చేలోపు ఫీల్డర్ ఒక చేత్తో బంతిని పట్టుకుని.. మరొక చేత్తో ఒక స్టంప్‌ని గ్రౌండ్‌ నుంచి పైకి లాగాలి. అప్పుడు దాన్ని రనౌట్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఒక బెయిల్ మాత్రమే కిందపడి.. మరొకటి వికెట్లపైనే ఉంటే? అప్పుడు ఆ మిగిలి ఉన్న బెయిల్‌ని పడగొడితే చాలు. అప్పుడది రనౌట్ కిందకే వస్తుంది. విజయ్ శంకర్ శనివారం రాత్రి చేసింది ఇదే. కానీ.. రిషభ్ పంత్‌ మాత్రం ఈ రూల్‌ తెలియనట్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దాంతో.. అంపైర్లు అతడికి రూల్ వివరించగా.. మౌనంగా వెళ్లిపోయాడు.

ఫెర్గూసన్ చెలరేగడంతో..

ఫెర్గూసన్ చెలరేగడంతో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీకి తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లతో 31) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులే చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(29 బంతుల్లో 7 ఫోర్లతో 43), లలిత్ యాదవ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్ నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Sunday, April 3, 2022, 15:40 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+