Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs GT:మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ తీన్మార్.. ఢిల్లీ బేజార్! గుజరాత్ ముందు ఈజీ టార్గెట్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు రషీద్ ఖాన్(3/31), మహమ్మద్ షమీ(3/41) అదరగొట్టారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వార్నర్(32 బంతుల్లో 7 ఫోర్లతో 37), అక్షర్ పటేల్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. షమీ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా... అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పృథ్వీ షా(7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో షా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక షమీ వేసిన మరుసటి ఓవర్‌లోనే మిచెల్ మార్ష్(4) కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి వార్నర్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.

 DC vs GT: Axar Patels Late Flourish Steers DC To 162/8 vs GT

క్రీజులో సెట్ అయిన డేవిడ్ వార్నర్‌(37), రిలీ రోసౌ(0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అల్జారీ జోసెఫ్జ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోలుకోలేని దెబ్బతీసాడు. ఈ పరిస్థితుల్లో అభిషేక్ పోరెల్(20) రెండు భారీ సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ రషీద్ ఖాన్ అతన్ని బౌల్డ్ చేయడంతో ఢిల్లీ 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్‌కు ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రయత్నానికి రషీద్ ఖాన్ చెక్ పెట్టాడు. ఊరించే బంతితో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

క్రీజులోకి వచ్చిన అమన్ ఖాన్(8) భారీ సిక్సర్ బాది మరుసటి బంతికే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ సాయంతో అక్షర్ పటేల్ ఓ సిక్సర్‌తో జట్టు స్కోర్‌ను 150 పరుగుల మార్క్ ధాటించాడు. కానీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అన్రిచ్ నోర్జ్ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో పోరాడే లక్ష్యాన్ని అందుకుంది.

Story first published: Tuesday, April 4, 2023, 21:32 [IST]
Other articles published on Apr 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+