Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026: కొంపముంచిన జెమీమా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో పరాజయం ఎదురైంది. గుజరాత్ జెయింట్స్‌‌తో ఆదివారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ తప్పిదం వల్ల చేజార్చుకుంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ ఆఖరి ఓవర్‌ను కట్టడిగా వేసి ఢిల్లీ పతనాన్ని శాసించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. సోఫీ డివైన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95) తృటిలో శతకం చేజార్చుకోగా.. కెప్టెన్ అష్లే గార్డ్‌నర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. ఢిల్లీ బౌలర్లలో నందని శర్మ(5/33) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. తెలుగు తేజం శ్రీ చరణి(2/42), చిన్నెల్లె హెన్రీ(2/43) రెండేసి వికెట్లు పడగొట్టారు. షెఫాలీ వర్మకు ఒక వికెట్ దక్కింది.

DC vs GG WPL 2026 Sophie Devine s All-Round Brilliance Stuns Delhi Capitals in Final-Over Thriller

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసి ఓటమిపాలైంది. లిజెల్లే లీ(54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84), లారా వోల్వార్డ్ట్(38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. షెఫాలీ వర్మ(14), జెమీమా రోడ్రిగ్స్(15) తీవ్రంగా నిరాశపర్చారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో సోఫీ డివైన్(2/21), రాజేశ్వరి గైక్వాడ్(2/34) రెండేసి వికెట్లు తీయగా.. కాశ్వీ గౌతమ్(1/48) ఒక వికెట్ పడగొట్టింది.

కొంపముంచిన జెమీమా

లిజెల్లీ లీ, లారా వోల్వార్డ్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ సునాయసంగా గెలిపించేలా కనిపించింది. ముఖ్యంగా 19వ ఓవర్‌లో లారా ఒక సిక్స్, ఫోర్ బాదగా.. జెమీమా ఒక బౌండరీ బాదడంతో 22 పరుగులు వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 7 పరుగులే అవసరమయ్యాయి. ఢిల్లీ విజయం లాంఛనమే అంతా అనుకున్నారు. కానీ సోఫీ డివైన్ స్టన్నింగ్ బౌలింగ్‌తో ఢిల్లీ విజయానికి అడ్డుగా నిలిచింది. తొలి బంతికి లారా సింగిల్ తీయగా.. రెండో బంతికి జెమీమాను సోఫీ డివైన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. ఈ వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

క్రీజులోకి వచ్చిన మరిజన్నే కాప్ ఒక బంతి డాట్ చేసి.. మరో బంతికి సింగిల్ తీసింది. ఐదో బంతికి లారా భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. ఆఖరి బంతికి ఢిల్లీ విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. సోఫీ డివైన్ డాట్ చేసింది. దాంతో గుజరాత్ విజయం లాంఛనమైంది. జెమీమా ఔటవ్వకుండా సింగిల్ తీసి లారాకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

Story first published: Sunday, January 11, 2026, 23:33 [IST]
Other articles published on Jan 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+