Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs CSK: ధోనీ విధ్వంసం.. ఢిల్లీ ఘన విజయం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో విజయా సాధించింది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) మెరుపులు మెరిపించాడు.

Delhi Capitals keep Dhoni-mania

పంత్ ఈజ్ బ్యాక్..
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. రీఎంట్రీ తర్వాత తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రిషభ్ పంత్..ఈ మ్యాచ్‌లో తన అసలు సిసలు ఆటను చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలి 23 బంతుల్లో 23 పరుగులే చేసిన అతను తర్వాతి 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది. అజింక్యా రహానే(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), డారిల్ మిచెల్(26 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

శుభారంభం లేదు..
భారీ లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2)లను ఖలీల్ అహ్మద్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో అజింక్యా రహానే, డారిల్ మిచెల్ ఆచితూచి ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.

క్రీజులో సెట్ అయిన డారిల్ మిచెల్‌ను అక్షర్ పటేల్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన రహానే‌తో పాటు శివమ్ దూబే(18), సమీర్ రిజ్వీ(0)లను ముఖేష్ కుమార్ ఔట్ చేశాడు.

దద్దరిల్లిన వైజాగ్..
దాంతో ధోనీ బ్యాటింగ్‌కు రాగా.. విశాఖ మైదానం అతని నామస్మరణతో దద్దరిల్లింది. క్రీజులోకి వచ్చి రావడంతోనే బౌండరీ బాదిన ధోనీ.. ఆ మరుసటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఖలీల్ అహ్మద్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన ధోనీ ఖలీల్ వేసిన 18వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు.

19వ ఓవర్‌లో ముఖేష్ కుమార్ 5 పరుగులే ఇవ్వడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. ఆఖరి ఓవర్‌లో ఆ జట్టుకు 41 పరుగులు అవసరమయ్యాయి. అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్‌లో ధోనీ 4, 6, 0, 4, 0, 6లతో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడినా.. ధోనీ సంచలన బ్యాటింగ్‌తో అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు.

Story first published: Sunday, March 31, 2024, 23:32 [IST]
Other articles published on Mar 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+