Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs CSK: ఢిల్లీ ఘోర పరాజయం.. క్వాలిఫయర్స్‌కు ధోనీ సేన!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అదిరిపోయే విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో 77 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. లక్నో కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటంతో కేకేఆర్‌పై ఆ జట్టు గెలిచినా చెన్నైకి వచ్చే నష్టం ఏం లేదు. చెన్నై ప్లే ఆఫ్స్ చేరడం ఇది 12వ సారి కావడం విశేషం.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటిన చెన్నై సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), డేవాన్ కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 )విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

DC vs CSK:

శివమ్ దూబే(9 బంతుల్లో 3 సిక్స్‌లతో 22), రవీంద్ర జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 86) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ, పతీరణ రెండేసి వికెట్లు పడగొట్టారు. తుషార్ దేశ్‌పాండే, జడేజాకు తలో వికెట్ దక్కింది.

చెన్నై పేసర్ల ధాటికి ఢిల్లీ 109 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేదు. పృథ్వీ షా(5), ఫిల్ సాల్ట్(3), యశ్ ధుల్(13), అక్షర్ పటేల్(15), హకీమ్ ఖాన్(7), లలిత్ యాదవ్(6) దారుణంగా విఫలమవ్వగా.. కుల్దీప్ యాదవ్(0) డకౌటయ్యాడు.

Story first published: Saturday, May 20, 2023, 19:27 [IST]
Other articles published on May 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+