For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs CSK: ధోనీకి మొగుడిలా తయారైన అవేశ్ ఖాన్! నేడు లెక్క సరిచేసేనా?

DC vs CSK: Beware Avesh Khan! MS Dhoni goes berserk in nets

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. లీగ్‌లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోయిన మహీ.. కీలక మ్యాచ్‌ల్లో సత్తా చాటాలనుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు(ఆదివారం) రాత్రి జరగనున్న క్వాలిఫయర్-1 మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ వెళ్లనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. దాంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా ధోనీ దారుణంగా విఫలమయ్యాడు. మరీ ముఖ్యంగా ఈ రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ పేసర్ అవేశ్ ఖాన్ బౌలింగ్‌లోనే ధోనీ ఔటవ్వడం గమనార్హం.

భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 10న ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీని అవేష్ ఖాన్ డకౌట్ చేశాడు. ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా పడిన బంతిని కాస్త లేట్‌గా ధోనీ ఆడగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్టంప్‌లను గీరాటేసింది. ఆ తర్వాత యూఏఈకి ధనాధన్ లీగ్ సెకండాఫ్ తరలిరాగా.. అక్టోబరు 4న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీని మళ్లీ అవేష్ ఖానే ఔట్ చేసేశాడు. సిక్స్ కోసం ప్రయత్నించిన మహీ.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ రెండు మ్యాచ్‌ల్లో ధోనీ కీలక సమయాల్లో వికెట్ చేజార్చుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్లు చేయలేక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ధోనీ రాగానే.. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ అవేశ్ ఖాన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మహీ.. అవేశ్ ఖాన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తులు చేశాడు. జాగ్రత్తగా మిడిల్ స్టంప్‌ లైన్‌పై గార్డ్ గీసుకుని మరీ హిట్టింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఎలాగైనా ఈ రోజు అవేశ్ ఖాన్‌‌కు బదులివ్వాలనే కసితో మహీ కనిపించాడు. ధోనీ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సీఎస్‌కే ట్వీట్ చేయగా అభిమానులు తమదైన శైలిలో బదులిస్తున్నారు. క్వాలిఫయర్‌లో‌లో అవేశ్ ఖాన్ చుక్కలే అని ఒకరంటే.. అవేశ్ కాచుకో.. అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

ఇక మిడిలార్డర్‌లో రాబిన్ ఉతప్ప తడబడుతుండటంతో ఈరోజు మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ ధోనీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అవేష్ ఖాన్‌‌పై రివేజంజ్ తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం సీఎస్‌కే కంటే ఢిల్లీ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం పట్టుదలతో ఉన్న ఢిల్లీ ప్రాణాలు పెట్టి ఆడుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతోంది. చివరి మూడు లీగ్‌ మ్యాచ్‌ల్లో ధోనీసేన ఓడినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ప్రతికూల పరిస్థితులను దాటి విజయాలు సాధించడం ఆ జట్టుకు అలవాటే.

Story first published: Sunday, October 10, 2021, 12:17 [IST]
Other articles published on Oct 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+