For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC Team For IPL 2022: బ్యాటింగ్, బౌలింగ్ సూపర్.. కానీ అప్పటి క్వాలిటీ లేదు! తుది జట్టు అంచనా ఇదే!

DC Team For IPL 2022: Delhi Capitals Playing 11, Batting, Bowling And Complete Review

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అసలు 2019 ముందు వరకూ ఆ జట్టుపై పెద్దగా అంచనాలు కూడా లేవు.. ఎందుకంటే అంతకుముందు 6 సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన పేలవం. ఆఖరి స్థానంలో లేదా చివరి నుంచి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కానీ 2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 2021 సీజన్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ టేబుల్ టాపర్‌గా నిలిచింది. కానీ అదృష్టం కలిసిరాక ఫైనల్ చేరలేకపోయింది. కనీసం ఈ సారైన ఆ కలను నెరవేర్చుకోవాలని రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.

 వేలంలో దూకుడు..

వేలంలో దూకుడు..

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అత్యంత బలమైన కోర్ టీమ్ కలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మెగా ఆక్షన్ పుణ్యమా? చెల్లా చెదురైంది. కొత్తగా రెండు జట్లు రావడం.. మెగా ఆక్షన్ కండీషన్స్‌తో తమ స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయినా వారికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తీసుకుంది. ముఖ్యంగా మెగా వేలంలో ఇతర జట్ల కన్నా దూకుడుగా కనిపించింది.

పర్స్ మనీ తక్కువగా ఉండటంతో ఆ జట్టు తమ బడ్జెట్‌‌‌ను చూసుకుంటూ ప్రతీ ఆటగాడికి బిడ్ వేసింది. ముఖ్యంగా ఆ జట్టు కో ఓనర్, తెలుగువాడైన కిరణ్ కుమార్ గ్రాంధీ వేలంలో చాలా చురుకుగా వ్యవహరించాడు. దాంతో అందుబాటులో ఉన్న వనరులతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన జట్టును ఎంచుకుంది.

అప్పటి క్వాలిటీ మిస్..

అప్పటి క్వాలిటీ మిస్..

ఢిల్లీ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగున్నప్పటికీ గత సీజన్ మాదిరి టాప్ క్వాలిటీ పేస్, స్పిన్ బౌలర్లు మాత్రం లేరు. కానీ ఉన్న వనరుల్లో ఢిల్లీ ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకుంది. శిఖర్ ధావన్ స్థానంలో ఐపీఎల్‌కే బ్రాండ్ అంబాసిడర్ అయిన డేవిడ్ వార్నర్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకుంది. మార్కస్ స్టోయినిస్ స్థానాన్ని మిచెల్ మార్ష్‌తో, ఆవేశ్ ఖాన్ ప్లేస్‌ను చేతన్ సకారియా, హెట్‌మైర్ ప్లేస్‌ను రోమన్ పోవెల్‌తో భర్తీ చేసింది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో పోవెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రబడా వంటి టాప్ క్లాస్ బౌలర్ మిస్ అయినా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగి ఎంగిడి వంటి బౌలర్లతో అతని స్థానాన్ని భర్తీ చేసింది.

 అగ్గువకే స్టార్ ప్లేయర్లు..

అగ్గువకే స్టార్ ప్లేయర్లు..

లుంగి ఎంగిడిని అతని కనీస ధర రూ.50 లక్షలకే సొంతం చేసుకున్న ఢిల్లీ.. వికెట్ టేకింగ్ బౌలర్ శార్థూల్ ఠాకూర్ కోసం రూ.10.75 కోట్లు ఖర్చు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన మిచెల్ మార్ష్‌ను రూ.6.75 కోట్లకు తీసుకుంది. ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా వంటి భారత బౌలర్లను బౌలింగ్ విభాగాన్ని పటిష్టపరుచుకుంది. అండర్ 19 కెప్టెన్ యశ్ ధుల్‌ను రూ.50 లక్షలకే కొట్టేసిన ఢిల్లీ.. లెఫ్టార్మ్ స్విప్నర్ విక్కీ ఓస్త్వాల్‌ను రూ.20 లక్షలకే తీసుకుంది. నెల్లూరు కుర్రాడు అశ్విన్ హెబ్బార్‌ను కనీస ధరకే ఎంచుకుంది. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్‌ఖాన్‌ను తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌లా ఇన్నోవేటివ్ షాట్స్ ఆడటం సర్ఫరాజ్ స్పెషాలిటీ. వికెట్ కీపర్ బ్యాకప్‌గా టాప్ క్లాస్ ప్లేయర్ కేఎస్ భరత్‌ను ఎంచుకుంది.

ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్..

ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్..

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌లు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆడనుండగా.. నాలుగో స్థానంలో రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఐదో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా మన్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కవచ్చు. పరిస్థితులను బట్టీ ఈ ఇద్దరిలో ఒకరికి చోటు దక్కనుంది. ఆ తర్వాత హిట్టర్ రోవ్‌మన్ పోవెల్ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌‌రౌండర్ అక్షర్ పటేల్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయనున్నారు. 8వ స్థానం వరకు ఢిల్లీకి బ్యాటింగ్ లైనప్ ఉండటం విశేషం. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కనుంది. పేసర్లుగా అన్రిచ్ నోర్జ్, చేతన్ సకారియా ఆడనున్నారు. ప్రతీ ప్లేస్‌కు టాప్ క్లాస్ ప్లేయర్ బ్యాకప్‌‌గా ఉండటం ఢిల్లీకి ప్లస్ పాయింట్.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా)

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, మన్‌దీప్ సింగ్/సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పోవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్,కుల్దీప్ యాదవ్

అన్రిచ్ నోర్జ్, చేతన్ సకారియా

IPL 2022 Mega Auction: David Warner bought by Delhi Capitals for ₹6.25 crore in IPL 2022 Auction
ఢిల్లీ పూర్తి జట్టు..

ఢిల్లీ పూర్తి జట్టు..

రిషభ్ పంత్(రూ.16 కోట్లు), అక్షర్ పటేల్(రూ.9 కోట్లు), పృథ్వీ షా(రూ.7.5 కోట్లు), అన్రిచో నోర్జ్(రూ.6.5 కోట్లు), డేవిడ్ వార్నర్(రూ.6.25 కోట్లు), మిచెల్ మార్ష్(రూ.6.5 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్(రూ.2 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ.10.75 కోట్లు), కుల్దీప్ యాదవ్(రూ.2 కోట్లు), అశ్విన్ హెబ్బర్ (రూ.20 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్(రూ.20 లక్షలు), కమలేశ్ నాగర్‌కోటి(రూ. కోటి 10 లక్షలు), కేఎస్ భరత్ (రూ.2 కోట్లు), మన్‌దీప్ సింగ్(రూ కోటి 10 లక్షలు), సయ్యద్ ఖలీల్ అహ్మద్(రూ.5.25 కోట్లు), లుంగి ఎంగిడి(రూ.50 లక్షలు), చేతన్ సకారియా(రూ.4.2 కోట్లు), యశ్ ధుల్(రూ.50 లక్షలు), విక్కీ ఓస్వాల్(రూ.20 లక్షలు), రిపాల్ పటేల్(రూ.20 లక్షలు), లలిత్ యాదవ్(రూ.65 లక్షలు), రోమన్ పోవెల్(రూ.2.8 కోట్లు), టీమ్ సీఫెర్ట్(రూ.50 లక్షలు), ప్రవీణ్ దుబే(రూ.50 లక్షలు)

Story first published: Tuesday, February 22, 2022, 11:46 [IST]
Other articles published on Feb 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+