ధోనీ బాయ్‌కి ప్రత్యేకస్థానం
ప్రాక్టీస్ అనంతరం రిషబ్ పంత్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'కెప్టెన్సీ బాధ్యతలతో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒక కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే మహీ బాయ్‌ను ఎదుర్కొంటున్నా. నా జీవితంలో ధోనీ బాయ్‌కి ప్రత్యేకస్థానం ఉంది. ధోనీ ఆటను చూస్తూ పెరిగిన నాకు ఈరోజు అతని ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. మహీ ఆట నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకున్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ధోనీ లాంటి వ్యక్తితో ఆడేందుకు ఏ ఆటగాడైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు నేను దానికోసం ఎదురుచూస్తున్నా' అని అన్నాడు.

టైటిల్ అందిస్తానో లేదో తెలియదు
'కెప్టెన్‌గా ఢిల్లీకి టైటిల్ అందిస్తానో లేదో తెలియదు. కానీ ఒక మంచి సారథిగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తా. నాకు తెలిసి ఢిల్లీ గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. జట్టులో ఉండే ప్రతీ ఆటగాడు వంద శాతం తన ఆటకు న్యాయం చేస్తున్నాడు. ఇలా అయితే జట్టుగా మేం బలంగా ఉన్నట్లు నమ్ముతున్నా. జట్టులో ఆహ్లదకర వాతావరణం ఉంటే మ్యాచ్ ఫలితాలు అనుకూలంగా వస్తాయి. శ్రేయాస్ అయ్యర్ లేని లోటు తీర్చడం కష్టం కానీ అతన్ని మరిపించే విధంగా జట్టు రాణించాలని కోరుకుంటున్నా' అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు.

తిరుగులేని ఫామ్‌లో పంత్
ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషబ్ పంత్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌పైనా అదే జోరు కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుసగా అర్ధ శతకాలు సాధించాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది.

ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అసలు 2019 ముందు వరకూ ఆ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు.. ఎందుకంటే అంతకుముందు ఆరు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన పేలవం. ఆఖరి స్థానంలో లేదా చివరి నుంచి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కానీ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్ ఆరంభానికి ముందే అయ్యర్ సేవలను కోల్పోయింది. దాంతో పంత్ తొలిసారి జట్టును నడిపించనున్నాడు. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో.. అనుభవం, దూకుడు కలగలిసి.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఢిల్లీ ఈ సారైనా టైటిల్ సాధిస్తుందో? లేదో చూడాలి.
IPL 2021: ముంబై ఇండియన్స్.. ఆ అరుదైన రికార్డు సాదించాలని కోరుకుంటున్నా: పార్థివ్ పటేల్


Click it and Unblock the Notifications












